లోక్ సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం..!

Women's Reservation Bill passed in Lok Sabha
Women's Reservation Bill passed in Lok Sabha

లోక్ సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందింది. బిల్లుకు అనుకూలంగా 454 మంది అంగీకారం తెలపగా.. ఇద్దరూ నో అని అని ఓట్ వేసినట్టు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. బిల్లుపై సుదీర్ఘ చర్చల తరువాత స్లిప్ ల ద్వారా సభలో ఓటింగ్ నిర్వహించారు. అంతకు ముందు అసంపూర్తిగా ఉందని విపక్షాలు లోక్ సభ నుంచి వాకౌట్ చేశాయి ఆ తరువాత స్లిప్ ల ద్వారా ఓటింగ్ ప్రారంభమైంది. డిజిటల్ ఓటింగ్ వ్యవస్థలో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఎరుపు, ఆకుపచ్చ స్లిప్ ల ద్వారా ఓటింగ్ నిర్వహించారు.

రెడ్, గ్రీన్ రంగు స్లిప్ లపై ఎస్, నో అని ఉంటాయని.. దానిపై సభ్యుడు సంతకం చేసి వారి పేరు, ఐడీ నెంబర్, సభ్యుడు సంతకం చేసి వారి పేరు, ఐడీ నెంబర్, నియోజకవర్గం, రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతం పేరు.. తేదీ వంటి వివరాలను రాయాలని లోక్ సభ సెక్రెటరీ ఉత్పల్ కుమార్ సింగ్ ముందే సూచించారు. స్లిప్ లు పంపిణీ చేసిన తరువాత నుంచి మళ్లీ సభ్యుల నుంచి తీసుకునే వరకు ఎవ్వరూ తమ యొక్క సీట్లను వదిలీ వెళ్లకూడదని సూచించారు. ఎట్టకేలకు ఇవాళ చివరికీ మహిళా రిజర్వేషన్ బిల్లు లోక్ సభలో ఆమోదం పొందింది.