World Cup 2023: మహమ్మద్ షమీతో ‘ఊసరవెల్లి’ బ్యూటీ పెళ్లి !

World Cup 2023: 'Chameleon' beauty wedding with Mohammed Shami!
World Cup 2023: 'Chameleon' beauty wedding with Mohammed Shami!

టీమిండియా బౌలర్ మహ్మద్ షమీనీ పెళ్లి చేసుకుంటానంటూ నటి పాయల్ ఘోష్ చేసిన ట్వీట్ వైరల్ అవుతుంది. వన్డే ప్రపంచ కప్-2023లో భారత్ అగ్ర పెసర్ మహ్మద్ షమీ దుమ్ము లేపుతున్నాడు. ఇప్పటివరకు ఈ మెగా టోర్నీలో కేవలం 4 మ్యాచ్ లలో మాత్రమే ఆడిన షమీ 16 వికెట్లు పడగొట్టి సిరీస్ లో టాప్ 5 బౌలర్ లిస్ట్ లో చేరారు. అలా భారత్ విజయాల్లో షమీ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ప్రస్తుతం యావత్ భారత్ మొత్తం షమీ పేరు మారు మ్రోగుతుంది. తాజాగా షమీ పెళ్లి గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతుంది.

నటి పాయల్ ఘోష్ షమీనీ పెళ్లి చేసుకుంటానంటూ చేసిన ట్వీట్ వైరల్ అవుతుంది. ‘షమీ…. నీ ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకో. ఆమె తన ట్వీట్ లో నేను నిన్ను పెళ్లి చేసుకోవడానికి రెడీ’ అని పేర్కొన్నారు. దీనిపై అతను స్పందించలేదు. పలువురు నెటిజన్లు మాత్రం ఆమెపై మండిపడుతున్నారు. ‘పెళ్లికి ఇంగ్లీషుతో పనేంటి? ఇంగ్లీష్ వస్తేనే పెళ్లి చేసుకుంటారా? ఎందుకు ఎగతాళి చేస్తున్నారు?’ అంటూ మండిపడుతున్నారు. కాగా.. ఊసరవెల్లి సినిమాలో నటి పాయల్ ఘోష్ నటించిన సంగతి తెలిసిందే.