ఐసీసీ ప్రపంచకప్ 2023 టోర్నమెంట్ చివరి దశకు వచ్చేసింది. ఐసీసీ ప్రపంచకప్ 2023 ఫైనల్స్ లో భారత్ ను ఢీకొట్టే ప్రత్యర్థి ఎవరనేది తేలిపోయింది. రెండో సెమీఫైనల్స్ లో దక్షిణాఫ్రికాను చిత్తు చేసింది ఆస్ట్రేలియా. ఫైనల్స్ లో అడుగు పెట్టింది. ఈ నెల 19వ తేదీన అంటే రేపే అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగే ఫైనల్స్ లో భారత్ తో తలపడుతుంది.
ఇక ఫైనల్స్ లో తలపడపోయే భారత తుది జట్టు కూర్పు ఎలా ఉండబోతుందనేది ఆసక్తి రేపుతోంది. లీగ్స్ దశ నుంచి సెమీఫైనల్స్ వరకు టీమిండియా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. బ్యాటింగ్ లో రోహిత్ శర్మ, శ్రేయస్ అయ్యర్, విరాట్ కోహ్లీ, శుబ్ మన్ గిల్, కేఎల్ రాహుల్ దూకుడు మీద ఉన్నారు. బౌలింగ్ డిపార్ట్మెంట్ సత్తా చాటుతోంది. ఒంటిచేత్తో మ్యాచ్ లను గెలిపించింది. బ్యాటర్లు భారీగా పరుగులు చేస్తుండగా…. బౌలర్లు ప్రత్యర్ధులను ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నారు.