సెమీస్ చేరిన టీమిండియాకు అదిరిపోయే శుభవార్త అందింది. హార్దిక్ పాండ్యా రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. హార్దిక్ పాండ్యా చీలమండ గాయంతో బాధపడుతూ బెంగుళూరు ఎన్సీఏలో వేగంగా కోలుకుంటున్నారు. ప్రస్తుతం నెట్ ప్రాక్టీస్ చేస్తున్నారు. నేషనల్ మీడియా వర్గాల ప్రకారం అతను సెమీస్ మ్యాచ్ కు అందుబాటులోకి వస్తారని తెలుస్తోంది.
దీంతో లీగ్ దశలో నెదర్లాండ్స్, శ్రీలంక, సౌత్ఆఫ్రికాతో మ్యాచ్ లకు కూడా అతను దూరం కానున్నారు. బంగ్లాదేశ్ తో మ్యాచ్ లో గాయపడిన హార్దిక్ కివీస్, ఇంగ్లాండ్ లతో మ్యాచులు ఆడని విషయం తెలిసిందే. ఇది ఇలా ఉండగా..భారత్ చేతిలో ఓటమితో ఇంగ్లాండు చెత్త రికార్డులు నమోదు చేసింది. డిఫెండింగ్ ఛాంపియన్ గా ప్రపంచ కప్ లో వరుసగా నాలుగు మ్యాచ్లు ఓడిన రెండో జట్టుగా నిలిచింది. 1992లో ఆస్ట్రేలియా ఇలా ఓడిపోయింది. అలాగే ఇంగ్లాండ్ వరుసగా మూడు మ్యాచ్లలో 200 రన్స్ లోపే ఆల్ అవుట్ కావడం ప్రపంచ కప్ చరిత్రలో ఇదే తొలిసారి.