World Cup 2023: డచ్ బౌలర్లకు చుక్కలు చూపించిన మాక్స్ వెల్…వరల్డ్ కప్ లో ఫాస్టెస్ట్ సెంచరీ!

World Cup 2023: Maxwell who showed dots to the Dutch bowlers...fastest century in the World Cup!
World Cup 2023: Maxwell who showed dots to the Dutch bowlers...fastest century in the World Cup!

నిన్న ప్రపంచ కప్ మ్యాచ్ లో భాగంగా ఆస్ట్రేలియా మొదట బ్యాటింగ్ ఎంచుకుని నెదర్లాండ్ ను ముప్పతిప్పలు పెట్టింది. ఆస్ట్రేలియా నిర్ణీత ఓవర్ లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 399 పరుగులు చేసింది. ఈ స్కోర్ చూడగానే నెదర్లాండ్ ప్లేయర్స్ భయపడేలా టార్గెట్ సెట్ చేసింది. ఆస్ట్రేలియా ఇనింగ్స్ లో మొదట డేవిడ్ వార్నర్ క్లాసిక్ సెంచరీ సాధించగా, ఆ తర్వాత డేంజరస్ మాక్స్ వెల్ క్రీజులోకి రాగానే బౌండరీలతో విరుచుకుపడ్డాడు. పడిన బంతిని పడినట్లే బౌండరీలు తరలిస్తూ డచ్ బౌలర్లను ఊచకోత కోశాడు. ఈ దశలో మాక్స్ వెల్ ప్రపంచ కప్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన సెంచరీని నమోదు చేశాడు.

కేవలం 40 బంతుల్లోనే 101 పరుగులు చేసి రికార్డును మాక్స్ వెల్ అందుకున్నాడు. ఇతని ఇన్నింగ్స్ లో 9 ఫోర్లు మరియు 8 సిక్సులు ఉన్నాయి.ఇతని విద్వంసానికి బౌలర్లకు ఎక్కడ బంతిని వేయాలో కూడా అర్ధం కాలేదంటే ఏ రీతిలో ఇన్నింగ్స్ సాగిందన్నది అర్ధం అవుతోంది. ప్రపంచ కప్ లో ఎవ్వరూ సాధించని ఘనతను సాధించి సింగిల్ మ్యాచ్ లోనూ మాక్స్ వెల్ హీరో అయిపోయాడు.