ప్రపంచ కప్ లో ఇవాళ శ్రీలంకతో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్ కు భారత్ మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ పై వేటు వేయాలని మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు సమాచారం. అతని స్థానంలో వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ ను జట్టులోకి తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. మహమ్మద్ సిరాజ్ స్థానంలో శార్దూల్ ఠాకూర్ కు ఛాన్స్ ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. హార్దిక్ పాండ్యా స్థానంలో సూర్య కుమార్ కొనసాగనున్నట్లు తెలుస్తోంది.
ఇది ఇలా ఉండగా.. ఇవాళ శ్రీలంక వర్సెస్ టీమ్ ఇండియా జట్ల మధ్య 33వ మ్యాచ్ జరుగుతుంది. ఇక ఈ మ్యాచ్ ముంబై లోని వంకాడే స్టేడియంలో జరగనుంది. ఇప్పటిలాగే ఇండియా వర్సెస్ శ్రీలంక మ్యాచ్ మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో ప్రారంభమవుతుంది. టాస్ గెలిచిన జట్టు మొదట బ్యాటింగ్ ఎంచుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అలాగే ఈ మ్యాచ్లో గెలిస్తే టీమిండియా నేరుగా సెమీ ఫైనల్ కు వెళ్తుంది.