వరల్డ్‌ కప్‌ టికెట్లు అప్పటి నుంచే.. వాళ్లకు మాత్రం స్పెషల్ ఆఫర్ గురూ!

World cup
World cup

ప్రపంచ క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న మెగా వార్ మరో 40 రోజుల్లో మొదలు కానుంది. భారత్‌ వేదికగా వన్డే ప్రపంచకప్‌-2023కు రంగం సిద్ధమైంది. మెయిన్ టోర్నీకి ముందు సన్నాహకంగా జరిగే వార్మప్‌ మ్యాచ్‌ల షెడ్యూల్‌ను ఐసీసీ బుధవారం విడుదల చేసిన సంగతి తెలిసిందే. టోర్నీలో 10 జట్లు పాల్గొననున్నాయి. సెప్టెంబర్‌ 29 నుంచి అక్టోబర్‌ 3 వరకు వార్మప్​ మ్యాచులు.. హైదరాబాద్, తిరువనంతపురం, గువహటి వేదికగా జరగనున్నాయి.

వరల్డ్ కప్‌ కోసం ‘బుక్‌ మై షో’ను తమ టికెటింగ్‌ భాగస్వామిగా బీసీసీఐ అనౌన్స్ చేసింది. ప్రధాన మ్యాచ్‌లు, వార్మప్​ మ్యాచ్‌లు కలిపి మొత్తం 58 మ్యాచ్‌ల టికెట్లను ఈ బుక్‌ మై షో ప్లాట్​ఫామ్​ ద్వారా కొనుగోలు చేయొచ్చని తెలిపింది. టీమ్​ఇండియా మినహా ఇతర జట్ల వార్మప్​ మ్యాచ్‌లు, ప్రధాన మ్యాచ్‌లకు సంబంధించిన టికెట్లు ఈ నెల ఆగస్ట్​ 25 నుంచి.. ఇండియాకు సంబంధించిన మ్యాచ్​ల టికెట్లు ఆగస్ట్​ 30 నుంచి అందుబాటులో ఉంటాయి. బోర్డు స్పాన్సర్లలో ఒకరైన మాస్టర్‌ కార్డ్‌ వినియోగదారులకు ఒకరోజు ముందుగానే(ఆగస్ట్​ 24 సాయంత్రం 6 గంటల నుంచే) టికెట్లు అందుబాటులో ఉంటాయి.