ఈ రోజు ప్రపంచ కప్ లో భాగంగా జరుగుతున్న డబుల్ హెడర్ లో ముందుగా న్యూజిలాండ్ మరియు పాకిస్తాన్ లు బెంగుళూరు వేదికగా తలపడుతున్నాయి. టాస్ గెలిచిన పాకిస్తాన్ బౌలింగ్ ఎంచుకోవడంతో కివీస్ బ్యాటింగ్ లో అదరగొడుతోంది. ముఖ్యంగా న్యూజిలాండ్ ఓపెనర్ మరియు ఆల్ రౌండర్ రచిన్ రవీంద్ర ఈ ప్రపంచ కప్ లో సూపర్ ఫామ్ ను కొనసాగిస్తున్నాడు. రవీంద్ర ఆడుతున్న మొదటి వరల్డ్ కప్ లోనే పరుగుల వరద పారిస్తూ చరిత్ర సృష్టించాడు.. తద్వారా తన పేరిట రెండు వరల్డ్ రికార్డులను లిఖించుకున్నాడు.
ఇక ఈ ప్రపంచ కప్ లో రవీంద్ర 8 మ్యాచ్ లలో 523 పరుగులు చేశాడు. కాగా ఇందులో మొత్తం మూడు సెంచరీ లు ఉండడం విశేషం. మొదటి ప్రపంచ కప్ లోనే 500 కు పైగా పరుగులు చేసిన రెండవ ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. అంతకు ముందు ఇంగ్లాండ్ ఆటగాడు బెయిర్ స్టో 2019 వరల్డ్ కప్ లో 532 పరుగులు చేశాడు. ఇంకా ఈ వరల్డ్ కప్ లో ముందు జరగనున్న మ్యాచ్ లలో ఎన్ని పరుగులు చేస్తాడో చూడాలి.