కుక్కకి 100 కోట్ల ఆస్తి

కుక్కకి 100 కోట్ల ఆస్తి

నిజానికి చాలామంది ఏంటీ ఈ జీవితం మరి విలువ లేకుండా పోయింది. మరీ కుక్క కన్న హీనంగా జీవిస్తున్నాం ఛీ అని అనుకుంటూ ఉంటాం. కానీ ఈ కుక్కని చూశాక అందరూ బతికితే ఈ కుక్కలా బతకాలి అని కచ్చితంగా అనుకుంటారు. ఏంటి ఇలా చెబుతున్నారు అని అనుకోకండి. ఇది నిజం యూఎస్‌లోని మియామిలో నివశిస్తున్న కుక్కను చూసి ఎవరైన ఇలానే అనుకుంటారు.

అసలు విషయంలోకెళ్లితే…యూఎస్‌లోని మియామిలో నివసిసున్న కుక్క ప్రపంచంలోనే అత్యంత సంపన్న కుక్క. పైగా దీనికి వందల కోట్లు విలువ చేసే భారీ బంగ్లా కూడా ఉంది. అయితే ఈ కుక్క పేరు గుంథర్ VI. ఈ కుక్క తాత గుంథర్ IV అనే మరో కుక్క నుంచి 500 మిలియన్ డాలర్ల సంపద వారసత్వంగా లభించింది. గత కొన్ని దశాబ్దాలుగా ఈ కుక్కలకు ఆస్తులు లభిస్తున్నాయి. ఈ కుక్క వంశానికి చెందిన గుంథర్ III 1992లో మరణించింది. దీంతో దాని చివరి యజమాని జర్మన్ కౌంటెస్ కార్లొట్టా లైబెన్‌స్టెయిన్ నుంచి ఈ కుక్కకు 58 మిలియన్ డాలర్లు విలువ చేసే ట్రస్ట్‌ వారసత్వంగా లభించింది.

అంతేకాదు రోజులు గడిచే కొద్ది ఆ ఆస్తుల విలువ పెరుగడం వల్ల గుంథర్ VI ప్రపంచంలోనే అత్యంత సంపన్న కుక్కగా రికార్డులకెక్కింది. ఈ కుక్కల ఆఖరి యజమాని చనిపోయిన తర్వాత హ్యాండర్ల బృందం వీటి బాధ్యతలు చూసుకుంటున్నారు. అయితే ఈ గుంథర్‌ VI తాను నివశిస్తున్న టుస్కాన్‌ విల్లాను అమ్మకానికి పెట్టింది. ఈ మేరకు ఈ భారీ సౌధాన్ని 2000 సంవత్సరంలో మడొన్నా నుంచి కొనుగోలు చేశారు. అయితే అప్పట్లో ఈ బంగ్లా విలువ రూ.7.5 మిలియన్ డాలర్లు . కానీ ఇప్పుడు దీన్ని రూ.238 కోట్లకు అమ్మకానికి పెట్టారు. అంతేకాదు ఈ భవనాన్ని 1928లో నిర్మించారు.

ఇందులో మొత్తం తొమ్మిది బెడ్‌రూమ్‌లు, ఎనిమిది బాత్‌రూమ్‌లు, ఔట్ డోర్ స్విమ్మింగ్ పూల్‌ ఉన్నాయి. పైగా ఈ ఇంటిని విక్రయించే బాధ్యతను ది అసోలిన్ టీమ్‌కు చెందిన ‘రూతీ అండ్ ఏతాన్ అస్సౌలిన్‌’ సంస్థ స్వీకరించింది. ఈ మేరకు ఆ సంస్థ నిర్వాహకురాలు రుతీ మాట్లాడతుతూ…అత్యంత ఖరీదైన ఈ భారీ సౌధానికి యజమాని కుక్క అని నేను ఆశ్చర్యపోయాను. అసలు నేను మొదట నమ్మలేకపోయాను. పైగా ఈ భవనానికి గొప్ప చరిత్ర ఉంది. అంతేకాదు గుంథర్ VIతో మేం సమావేశమైనప్పుడు ఆ కుక్క పరుగెత్తుకుంటూ వచ్చి నాకు ముద్దిచ్చింది. ఓహో ఇది మాతో తను ఒప్పందం చేసుకోవడం ఇష్టమే అన్నట్లుగా ఇలా ముద్దిచ్చినట్లుందని భావిస్తున‍్నా” అని అన్నారు.