ఆలేరులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ట్రాక్టర్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఇద్దరు మృతిచెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులను హైవేపై పనిచేసే దినసరి కూలీలుగా గుర్తించారు.
అంకర్ల లక్ష్మి, ఊరేళ్ల శ్యామ్ ప్రమాద స‍్థలంలోనే మృతి చెందారు. అంకర్ల కవిత, ఊరేళ్ల లావణ్య తీవ్రంగా గాయపడటంతో ఆలేరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీరంతా భువనగిరి మండలం రాయగిరికి చెందిన వారిగా గుర్తించారు.