ఇటీవల జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో గాయపడిన హీరోయిన్ యాషికా ఆనంద్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ప్రమాదం జరిగి మూడు నెలలు గడుస్తున్న ఇప్పటి వరకు ఆమె ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. తమిళనాడు గత నెల జులై 24న జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో ఆమె స్నేహితురాలు పావని మృతి చెందగా యాషికకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆమెను చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయడిన ఆమె కనీసం నడవలేని, నిలబడలేని స్థితిలో ఉన్నారు. దీంతో మూడు నెలలుగా ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్న యాషిక ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు.
ఆమె ఒక్కో అడుగు వేస్తూ నడిచే ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను యాషిక తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. ఈ సందర్భంగా.. ‘ఆసుపత్రి వైద్యుల సాయంతో నడవడం ప్రాక్టీస్ చేస్తున్నా’ అని ఆమె తెలిపారు. అంతేగాక తగిలిన గాయాలను, పడుతోన్న బాధ గురించి వివరిస్తూ ఆమె కన్నీటీ పర్యంతరం అయ్యారు. దీంతో ఆమె త్వరగా కోలుకోవాలని అభిమానులు ఆశిస్తు కామెంట్ చేస్తున్నారు. అయితే ఈ యాక్సిడెంట్ కేసులో పోలీసులు ఆమెను త్వరలోనే విచారించనున్నారు. కాగా విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన ‘నోటా’ సినిమాతో పాటు తమిళంలో పలు చిత్రాల్లో కూడా ఆమె హీరోయిన్గా నటించారు.