ప్రజావేదికని వైసీపీ అడగలేదట

ycp can not ask public opinion

ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం పక్కనే ఉన్న ప్రజావేదికకు సంబంధించి తన పేరిట సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్ వ్యాఖ్యానించారు. ప్రజావేదికను వైసీపీకి కేటాయించాలని పార్టీ తరఫునగానీ, తానుగానీ ఎటువంటి లేఖలు ఇవ్వలేదని, ఈ విషయాన్ని ఇప్పటికే స్పష్టం చేశానని ఆయన చెప్పారు. ఈ విషయంలో మీడియాలో ఇంకా వార్తలు వస్తున్నందునే మరోసారి స్పందిస్తున్నానని ఆయన అన్నారు. కాగా, కృష్ణా నది కరకట్టపై మాజీ సీఎం చంద్రబాబు నాయుడు నివాసం సమీపంలో ప్రజావేదిక ఉందన్న సంగతి తెలిసిందే. పార్టీ కార్యకలాపాల కోసం ఈ ప్రజావేదికను తమకే అప్పగించాలని టీడీపీ కోరిన నేపధ్యంలో వైసీపీకి ఆ వేదిక కావలని ఆయన కోరినట్టు ప్రచారం జరిగింది. ఈ నేపధ్యంలోనే తన పేరుతో సర్క్యులేట్ అవుతోన్న వార్తలపై వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్ స్పందించారు. కృష్ణా నది కరకట్టపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్రమ నివాసం సమీపంలో నిర్మించిన ప్రజావేదికపై తానుగానీ, వైఎస్సార్‌సీపీ నుంచి గానీ ఎలాంటి లేఖలు ఇవ్వలేదని స్పష్టం  చేశారు. ఈ విషయంలో తనకు ఎటువంటి సంబంధం లేదని ఇదివరకే ప్రకటించానని పేర్కొన్నారు.