బాలయ్య బర్త్ డే….అభిమానుల సేవా కార్యక్రమాలు

balakrishna birthday

నందమూరి అందగాడు బాలయ్య పుట్టిన రోజు వేడుకలు అనగానే ఆయన అభిమానులకు అది పండుగ రోజే. ఆ రోజు అనేక సేవా కార్యక్రమాలు సహా ఇతర కార్యక్రమాలు కూడా చేపట్టి బాలయ్యపై తమకు ఉన్న అభిమానాన్ని చాటుకుంటారు అభిమానులు. ఈరోజు  పుట్టిన రోజు కావడతో అభిమానులు ఏర్పాట్లు  ఏటా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించే బాలయ్య యువసేన.. జూన్ 10న బాలయ్య పుట్టినరోజుని పురస్కరించుకుని, ‘డొనేట్ బ్లడ్, సేవ్ లివ్స్’ అంటూ.. రక్తదాన శిబిరం ఏర్పాటు చెయ్యడం జరిగింది.. నటసింహా నందమూరి బాలకృష్ణ 59వ పుట్టినరోజు సందర్భంగా.. రెండు తెలుగు రాష్ట్రాలలో ఆయన అభిమానులు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ వారి సహకారంతో.. ‘బాలయ్య యువసేన’ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసారు. వివిధ ప్రాంతాలనుండి బాలయ్య అభిమానులు భారీగా తరలివచ్చి, రక్తదానం చేసారు.