కొడాలి నాని దేవినేని ఉమాకి థాంక్స్ చెప్పాలట….ఎంపీ సంచలనం

kodali nani has to say thanks to devineni uma

ఏపీలో ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా కృష్ణా జిల్లా రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. తాజాగా విజయవాడ ఎంపీ కేశినేని నాని ఫేస్ బుక్‌లో పెట్టిన ఓ పోస్టు కలకలం రేపుతోంది. ‘కొడాలి నాని తనని మంత్రిని చేసిన దేవినేని ఉమాకి జీవితాంతం కృతజ్ఞుడిగా ఉండాలి ’ అని కేశినేని తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్టు పెట్టారు. దీంతో ఇప్పుడీ పోస్టు టీడీపీలో తీవ్ర దమారం రేపుతోంది. దీని వెనుక కేశినేని అసలు టార్గెట్ ఏంటనే దాని మీద పెద్ద చర్చ జరుగుతోంది.  గుడివాడ అసెంబ్లీ స్థానం నుండి విజయం సాధించిన కొడాలి నాని‌కి జగన్ మంత్రివర్గంలో చోటు దక్కింది.   ఈ విషయమై కేశినేని నాని వ్యాఖ్యలు చేశారు. కొడాలి నాని  తనని మంత్రిని చేసిన దేవినేని ఉమాకి జీవితాంతం కృతజ్ఞుడిగా ఉండాలని  తన ఫేస్ బుక్‌లో పోస్టు పెట్టాడు. అయితే మంత్రిని చేసింది జగన్ అయితే ఇప్పుడు దేవినేనికి థాంక్స్ ఎంఫ్దుకా అనుకుంటున్నారా ? ఒకప్పుడు కొడాలి నాని టీడీపీని వీడి బయటకి వచ్చేందుకు దేవినేని కారణం అని ప్రచారం ఉండేది. కొడాలి నాని పార్టీలో బలపడితే తనకు భవిష్యత్తులో ముప్పు వస్తుందని భావించిన ఆయన ఆయన్ని తొక్కడానికి ప్రయత్నించగా కొడాలి బయటకు వెళ్లి జగన్ వెంట నడిచారు, అయితే తాజాగా కేశినేనిని కూడా ఉమా ఇబ్బంది పెడుతున్నారని  పార్లమెంట్‌లో పార్టీ పదవుల కేటాయింపుల విషయంలో  కూడ కేశినేని నాని చంద్రబాబు తీరుపై అసంతృప్తితో ఉన్నారు. దీంతో పార్లమెంట్‌లో టీడీపీ విప్ పదవిని తిరస్కరిస్తున్నట్టుగా చంద్రబాబుకు ఫేస్‌బుక్‌ ద్వారా ఇటీవలనే విన్నవించారు. ఆ తర్వాత  అదే రోజున బాబు పిలిపించి నానితో గంటకు పైగా చర్చించారు. చంద్రబాబునాయుడు చర్చించిన మరునాడే పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్లు తప్ప అంటూ కామెంట్ పెట్టి ఈరోజు  కొడాలి నానిని ఉద్దేశించి కేశినేని నాని ఈ వ్యాఖ్యలు చేశారు.