వైసీపీ కి బీజేపీ అంటే కాస్త సాఫ్ట్ కార్నర్

వైసీపీ కి బీజేపీ అంటే కాస్త సాఫ్ట్ కార్నర్

గత 2019 ఏడాదిలో జరిగినటువంటి ఏపీ సార్వత్రిక ఎన్నికల అనంతరం వచ్చిన ఫలితాల రీత్యా తెలుగుదేశం పార్టీ నుంచి ఊహించని రీతిలో వలసలు మొదలయ్యాయి.చరిత్రలో ఎన్నడూ లేని విధమైన అపజయాన్ని టీడీపీ మూటగట్టుకుని సరికి తెలుగు తమ్ముళ్లు సైకిల్ ను వదిలి “ఫ్యాన్” మరియు “కమలం” లను పట్టుకున్నారు.అయితే అధికంగా మాత్రం జాతీయంగా అధికారంలో ఉన్నటువంటి బీజేపీలోకే వెళ్తున్నారు.

అయితే మొదటి నుంచి కూడా వైసీపీ కు బీజేపీ అంటే కాస్త సాఫ్ట్ కార్నర్ తోనే ఉంది.గతంలో ప్రతిపక్షములో ఉన్నటువంటి జగన్ కు ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి జగన్ కు చాలా తేడా వచ్చింది.అందుకే ఏమో కానీ బీజేపీ వారు ఎన్ని మాటలు అన్నా సరే వీరు నోరు పెగల్చడం లేదు.దీనితో బీజేపీ అంటే జగన్ అండ్ కో కు భయం అని ఇపుడు వైసీపీ వాళ్లకు కూడా అర్ధం అయ్యిందో ఏమో కానీ ఇటీవలే చేరిన వారు కూడా బీజేపీలోకి క్యూ కడుతున్నారు.

అలా ఎన్నికలకు ముందు జగన్ సమక్షంలో తెలుగు పరిశ్రమకు చెందిన ఎందరో వైసీపీ కండువా కప్పుకొని చేరిపోయారు.అలాంటి వారిలో ప్రముఖ నటులు మోహన్ బాబు కూడా ఒకరు.అయితే నిన్న మోహన్ బాబు మరియు మంచు లక్ష్మి సహా ఆయన కుటుంబమే మోడీని కలవడం హాట్ టాపిక్ అయ్యింది.అయితే దీనితో ఆయన ఇప్పుడు జగన్ కు ఝలక్ ఇచ్చి బీజేపీలో చేరబోతున్నారని టాక్ వినిపిస్తుంది.మరి మొత్తానికి ఈయన ఈ సంచలన నిర్ణయం తీసుకోడం వెనుక ఏదన్నా గట్టి కారణమే ఉండి ఉండాలని చెప్పాలి.