వైఎస్ జగన్ సీఎంగా ఆరు నెలల పాలన పూర్తి చేసుకున్నారు. ఈ తక్కువ సమయంలోనే జగన్ అనేక సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టారు. వీటిలో ఎక్కువ భాగం తన తండ్రి వైఎస్ ఆర్ పేరుపైనే రూపొందించారు. తన మేనిఫెస్టోలో చెప్పినవన్నీ అమలు చేయడమే లక్ష్యంగా జగన్ పాలన సాగిస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రగానే ఉన్నా తాను ఇచ్చిన మాటలకు కట్టుబడి ఉండేందుకే జగన్ మొగ్గు చూపుతున్నారు.
అయితే జగన్ పాలన పట్ల సహజంగానే విపక్షం కారాలు మిరియాలు నూరుతోంది. జగన్ ఆరు నెలల పాలనలో సాధించింది శూన్యమని ఆరోపిస్తున్నారు. అందుకే వైసీపీ చంద్రబాబుకు ఓ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ప్రతిపక్ష నాయకుడు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు వైయస్ఆర్ సీపీ కర్నూలు పార్లమెంట్ ఇన్ చార్జ్ బి.వై. రామయ్య ఆదివారం బంపర్ ఆఫర్ ప్రకటించారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల పేర్లను చెబితే చాలు.. లక్ష రూపాయలు బహుమతిగా ఇస్తానన్నారు.