మద్యం మత్తులో ఒక మాజీ ప్రజాప్రతినిధి, వైకాపా కార్యకర్త రక్షిత మంచి నీటి పథకంలో విషం లాంటిది కలిపాడు. అయితే కలిపినా పదార్ధమేదో సరిగా గుర్తించలేని ఆ పదార్ధం పురుగుల మందు లేదా పెట్రోలు అయి ఉంటుందని భావిస్తున్నారు. నిన్న సాయంత్రం నూజీవీడు రూరల్ బత్తులవారి గూడెంలో మాజీ సర్పంచి భూక్యా శ్రీను ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు.
అయితే ఈ ఘటన మొత్తాన్ని ట్యాంకు పై నుంచుని సెల్ఫీలు దిగుతున్న యువకులు సెల్ ఫోన్లో చిత్రీకరించారు. ఆయన సదరు యువకులను బెదిరించడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఇటీవలే సదరు వ్యక్తి తెదేపాను వీడి వైకాపాలో చేరినట్లు గ్రామస్థులు చెబుతున్నారు. రాజకీయాల నేపథ్యంలో మద్యం మత్తులో ఉండి ఆ వ్యక్తి ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడని తెలుస్తోంది. ఎస్సీ కాలనీకి చెందిన కొందరు యువకుల కంప్లైంట్ తో అక్కడకి చేరుకున్న పోలీసులు అక్కడకి వెళ్లి ఆ ట్యాంక్ నీటిని వదిలేశారు. ఆ కలిపినా వ్యక్తి కూడా అప్పటి నుండి పరారీలో ఉన్నాడు. ఈ ఘటన పై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.