ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయాధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుపై పాయకరావుపేట వైపీసీ ఎమ్మెల్యే గొల్ల బాబురావు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. కాగా దళిత ఐఏఎస్ అధికారి విజయ్‌కుమార్ పై కొన్ని సంచలన వాఖ్యలు చేసినందుకు గాను చంద్రబాబు పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే గొల్ల బాబురావు నక్కలపల్లి పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఒక ఐఏఎస్ అధికారిని ఇలా కించపరచడం అనేది చంద్రబాబు కి భవ్యం కాదని ఎమ్మెల్యే గొల్ల బాబురావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాజకీయాల్లో 40 ఏళ్ల అనుభవం ఉందని చెప్పుకుంటున్న టీడీపీ అధినేత చంద్రబాబు కి ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియకపోవడం అనేది హాస్యాస్పదం అని ఎమ్మెల్యే బాబురావు అన్నారు… అంతేకాకుండా చంద్రబాబు ప్రతీసారి దళితులను అవమానించడం బాగా అలవాటైపోయిందని, రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో ప్రజలందరూ కలిసి బుద్ది చెప్పినప్పటికీ కూడా చంద్రబాబు కి ఎలాంటి చలనం లేదని, ఇప్పటికీ అదే పద్దతి కొనసాగిస్తున్నారని ఆరోపించారు.