వైసీపీ దీక్షకి అనుకోని అవాంతరాలు, ఎంపీకి తీవ్ర అస్వస్థత

mekapati-rajamohan-reddy-fa

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

ప్రత్యేకహోదా కోసం ఢిల్లీలో దీక్షకు దిగిన వైసీపీకి అనుకోని అవాంతరాలు ఎదురవుతూనే ఉన్నాయి. నిన్న సాయంత్రం దీక్ష మొదలయిన కొద్ది సేపటికే భారీ ఈదురు గాలులు, దుమారం చెలరేగి భారీ వర్షం కురిసింది. ఈదురుగాల వల్ల ఏపీ భవన్ వద్ద వైసీపీ దీక్షా శిబిరం టెంట్లు కుప్పకూలిపోయాయి. దీంతో, దీక్షా శిబిరంలోని వైసీపీ ఎంపీలు ఏపీ భవన్ లోనికి వెళ్లి లోపల తమ దీక్ష చేపట్టారు. ఇప్పుడు మరో సారి వారి దీక్ష కి అవాంతరం వచ్చినట్టు అయ్యింది. అదేంటంటే ప్రత్యేకహోదా కోసం ఢిల్లీలో దీక్షకు దిగిన ఐదుగురు పార్లమెంటు సభ్యుల్లో ఒకరు అస్వస్థతకు గురయ్యారు. ఉన్న ఎంపీలు అందరిలో సీనియర్ అయిన నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తీవ్రమైన కడుపునొప్పి రావడంతో ఆయనను పరీక్షించిన వైద్యులు నిరాహారదీక్షను విరమించాలని సూచించారు.

అయినప్పటికీ దీక్షను విరమించేందుకు ఆయన నిరాకరించారు. ప్రత్యేక హోదా గురించి చేస్తున్న ఈ దీక్ష కోసం ఎట్టిపరిస్థితుల్లో తానూ వెనకడుగు వేయనని అన్నారు.మేకపాటి వయస్సు 75 ఏళ్ళు అందుకే ఈ వయస్సులో దీక్ష వద్దని వైద్యులు వారించినా ఆయన మాత్రం వినడం లేదు. మేకపాటికి తీవ్రమైన కడుపునొప్పి వచ్చిందని, దీక్ష విరమించడమే మేలని వైద్యులు సూచిస్తున్నామేకపాటి మాత్రం వెనకడుగు వేయనని అంటున్నారు. వయసు ప్రభావం వలన ఒక్క రోజుకే ఇలా అయితే ఇంకొన్ని రోజులు దీక్ష చేస్తే ఆయన ఆరోగ్యం అమవుతుందో అని వైసీపీ ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఒకవేళ ఆయన ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఆసుపత్రికి తరలిస్తే మిగిలిన ఎంపీలు దీక్ష కొనసాగించేలా వైసీపీ ప్లాన్ చేస్తుందని తెలుస్తోంది.