Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కాబోయే సీఎం నేనే అంటూ వైసీపీ అధినేత జగన్ బహిరంగ సభల్లో చెప్పిన మాట విని విని విసుగుపుట్టిన తెలుగు ప్రజలకు ఇంకో షాక్. జగన్ సీఎం అవుతాడో ,లేదో తెలియదు గానీ అదే పార్టీ నుంచి ఇంకొకాయన నేను కాబోయే కేంద్ర మంత్రిని అని బయలుదేరాడు. ఆయన ఇంకెవరో కాదు.వైసీపీ అధినేత జగన్ కి కుడి భుజం లాంటి విజయసాయిరెడ్డి. బీజేపీ ,టీడీపీ మధ్య దూరం పెంచడానికి తాను చేసిన ప్రయత్నాలు విజయవంతం అయ్యాయని , త్వరలో చంద్రబాబు కమలనాథులకు గుడ్ బై కొట్టడం ,తాము కేంద్ర మంత్రివర్గంలో చేరడం లాంఛనం అని విజయసాయి బలంగా నమ్ముతున్నారు. ఇదే విషయాన్ని సన్నిహితుల దగ్గర పదేపదే చెబుతున్నారట కూడా.
వైసీపీ ఎంపీ గా కేంద్ర మంత్రివర్గంలో చేరడంతో కొందరి పని పడతానని విజయసాయి చేస్తున్న కామెంట్స్ తో ఆయన సన్నిహితులే ఆశ్చర్యపోతున్నారట. అందుకు కారణం లేకపోలేదు. విజయసాయి టార్గెట్ చేస్తున్న వాళ్ళు టీడీపీ నాయకులు కాదు. ప్రభుత్వ అధికారులు. చంద్రబాబు సర్కార్ లో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న కొందరు అధికారుల మీద కక్ష తీర్చుకుంటామని విజయసాయి చేస్తున్న వ్యాఖ్యలు చిన్న పిల్లల మాటల్ని తలపిస్తున్నాయి. అయితే ఆ నోటా ఈనోటా పడి ఈ మాటలు ఆ అధికారుల దగ్గరకు చేరాయట. ఈ మాటలు విని సీఎం పేషీలో పని చేస్తున్న సదరు అధికారులు భయపడడం మాట అటుంచి ఈయన కామెంట్స్ తో పగలబడి నవ్వుకుంటున్నారట. ఓ ఐఏఎస్ అధికారి ఇంకో అడుగు ముందుకేసి A 1 సీఎం , A 2 సెంట్రల్ మినిస్టర్ అయితే ఇక్కడ మేము ఉద్యోగాలు చేయములే అని అన్నారట. ఈ డైలాగ్ విజయసాయి దగ్గరకు చేరితే ఆయన ఎలా రియాక్ట్ అవుతారో చూద్దాం.