మన దేశంలో పుట్టి.. మన దేశంలో ఉంటూ.. కొందరు పాకిస్తాన్‌కు మద్దతుగా మాట్లాడుతున్నారు. అలాంటి వాళ్లు సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు.. అంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రశ్నించారు.. పహల్గామ్ ఘటనపై కొందరు స్పందిస్తున్న తీరుపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉగ్రదాడి మృతులకు పవన్ సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన పవన్ కల్యాణ్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. మత ప్రాతిపదికన 26 మందిని చంపినా పాకిస్థాన్‌కు అనుకూలంగా మాట్లాడటం సరికాదని.. కొందరు ఇండియాలో ఉండి పాకిస్తాన్‌ను ప్రేమిస్తున్నారు. పాకిస్తాన్‌ను ప్రేమించేవాళ్లు ఆ దేశానికి వెళ్లిపోవచ్చంటూ పవన్ సూచించారు.




