టాలీవుడ్ సినీ పరిశ్రమకు చెందిన సెలబ్రిటీలు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారో తెలియదు.. ఎప్పుడు విడిపోతారో తెలియదు. ముఖ్యంగా కొంతమంది ప్రేమ పెళ్లిళ్లు చేసుకుంటూ ఉంటె .. మరి కొంతమంది పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లు చేసుకుంటు ఉన్నారు . అయినా సరే వాళ్ళ మధ్య సఖ్యత లేకుంటే విడిపోవడానికి కూడా వెనుకాడట్లేదు . ఈ క్రమంలోనే ఈ ఏడాది మెగా డాటర్ నిహారిక కూడా చైతన్య జొన్నలగడ్డ ను పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకొని సంతోషంగా ఉంటుంది అని మనం అనుకునే లోపే.. ఆమె విడాకులు ఇచ్చి అందరినీ ఆశ్చర్యానికి కూడా గురిచేసింది.
ఆ తర్వాత కలర్స్ స్వాతి కూడా విడాకులు తీసుకునే అవకాశం ఉంది అంటూ వార్తలు తెరపైకి వచ్చాయి. కానీ ఈ విషయం మీద స్వాతి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయలేదంట . దీంతో విడాకులు ఖాయం అంటూ ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పుడు వీరిని పక్కన పెడితే ఒక టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ విడాకులకు సిద్ధమవుతున్నారని తెలిసి ఫిలింనగర్ వర్గాలలో చర్చ జరుగుతోంది. ఆయన ఒక యంగ్ డైరెక్టర్ కాగా గట్టిగా పది మూవీ లు చేయకపోయినా సెన్సిబుల్ డైరెక్టర్ గా మంచి సినిమాలు చేస్తాడు అనే పేరు ను కూడా తెచ్చుకున్నాడు.
ఇక ఈ ఏడాది మొదట్లోనే స్టార్ హీరోతో సినిమా చేసి డీసెంట్ హిట్ అందుకున్న ఆయన ఆ తర్వాత కొన్ని రోజులకే వివాహం కూడా చేసుకున్నాడు. ఆ సినిమా ఇచ్చిన బూస్ట్ తో మరో సినిమా తెరకెక్కించడానికి సిద్ధమవుతున్న ఆ డైరెక్టర్ పర్సనల్ లైఫ్ లో మాత్రం బాగా విసిగిపోతున్నారట. అంతేకాదు కొన్ని విషయాలలో ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో విడాకుల కోసం అప్లై చేసినట్లు.. ఇక లీగల్ ప్రొసీజర్ అంతా పూర్తయ్యేందుకు కొంతకాలం పడుతుందని సమాచారం. ఏదేమైనా సినీ ఇండస్ట్రీలో వరుస విడాకులు వార్తలు అభిమానులను కలవరపెడుతునే ఉంటున్నాయి .