సినిమాల్లోకి రావాలని ఎంతోమంది కలలు కంటుంటారు. ఆ కలను సాకారం చేసుకునేందుకు ఎంతగానో కష్టపడతారు. కానీ 24 ఏళ్ల ఔత్సాహిక దర్శకుడు దొడ్డిదారిన డబ్బులు సంపాదించి దాంతో ఎలాగైనా షార్ట్ ఫిలిం తీయాలనుకున్నాడు. తీరా తన ప్లాన్ బెడిసికొట్టడంతో అందరి చేత చీవాట్లు తిన్నాడు.తమిళనాడులోని చెన్నైకి చెందిన ఓ వ్యక్తి షార్ట్ ఫిలిం తీయాలనుకున్నాడు.
ఇందుకోసం తన తండ్రి పెన్సిలయ్య రూ.30 లక్షలు అడగ్గా ఆయన అంతమొత్తం ఇవ్వడం కుదరదని తిరస్కరించి కేవలం రూ.5 లక్షలు అప్పజెప్పాడు. దీంతో ఆ యువకుడు తన స్నేహితులతో కలిసి కిడ్నాప్ డ్రామా ఆడాడు. 30 లక్షల రూపాయల నగదు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అది కూడా తెలంగాణకి తీసుకురావాలని, ఈ విషయం పోలీసులకు చెబితే చంపేస్తామని బెదిరించారు.
దీనిపై పెన్సిలయ్య పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో ఇదంతా ఫేక్ కిడ్నాప్ డ్రామా అని గుర్తించిన పోలీసులు ఇద్దరు స్నేహితులతో కలిసి ఉన్న సదరు యువకుడిని సికింద్రాబాద్లోని హోటల్ గదిలో పట్టుకున్నారు. విచారణలో పార్ట్ ఫిలిం కోసమే ఇదంతా చేశామని నేరం అంగీకరించడంతో పోలీసులు వారిని మందలించి పంపించివేశారు.