ఇంటి నుంచి బయటకు వెళ్లిన యువతి అదృశ్యమైన సంఘటన పేట్‌బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భాగ్యలక్ష్మి కాలనీకి చెందిన శ్రీను, నాగసత్యవేణి పెద్దకుమార్తె నాగరేవతి ఈ నెల 8వ తేదీ ఉదయం 11 గంటలకు సుచిత్రలోని ఓ దుస్తుల షాపులోని తన స్నేహితులను కలిసి వస్తానని చెప్పి బయటకు వెళ్లింది.
అలాగే చింతల్‌లోని ఓ కళాశాలలో చదువుతున్న తన సోదరికి ఇచ్చేందుకు టిఫిన్‌బాక్స్ కూడా తీసుకు వెళ్లింది. కాగా చిన్నకుమార్తె ఫోన్ చేసిన తనకు టిఫిన్స్ బాక్స్ అందలేదని చెప్పడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు నాగరేవతి మొబైక్‌కు ఫోన్ చేయగా స్విచ్చాఫ్ వచ్చింది. దీంతో గురువారం పేట్‌బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.