టాలీవుడ్ హీరో అడివి శేష్ కోలుకున్నారు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి చేరుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ట్విట్టర్ ద్వారా తెలిపారు. ‘ఇంటికి తిరిగి వచ్చాను. విశ్రాంతి తీసుకుంటూ కోలుకుంటాను’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు. కాగా కొద్ది రోజుల క్రితం అడివి శేష్ ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. డెంగ్యూ బారినపడి, ఆయనకు రక్తంలో ప్లేట్‌లెట్స్ అకస్మాత్తుగా తగ్గిపోవడంతో ఈనెల 18న హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు.
ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం శేష్ “మేజర్” సినిమాలో నటిస్తున్నారు. 26/11 ముంబై టెర్రర్ అటాక్ లో అమరుడైన ఆర్మీ ఆఫీసర్ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుంది. శశికిరణ్ తిక్క దర్శకత్వంలో మహేష్ బాబు జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్ ఏ ప్లస్ ఎస్ మూవీస్ సహకారంతో సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా ఈ మూవీని నిర్మిస్తోంది.