భార్యను పోషించలేననే బాధతో వివాహం నిశ్చయమైన మరుసటి రోజే యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఎల్లారెడ్డి మండలం జిత్యాతండాలో శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్సై శ్వేత తెలిపిన వివరాల ప్రకారం.. తండాకు చెందిన రాందాస్ (24) శు క్రవారం తండా శివారులోని పొలంలో చెట్టుకు చీరతో ఉరి వేసుకుని ఆత్యహత్య చేసుకున్నాడు.
రాందాస్‌కు ఈ నెల 27న నిజాంసాగర్ మండలంలోని గాలిపూర్ గ్రామానికి చెందిన యువతితో వివాహం నిశ్చయమైంది. 28న పెళ్లి పత్రిక పెట్టుకునేందుకు అమ్మాయి తరఫు బంధువులు అబ్బాయి ఇంటికి రాగా పత్రిక పెట్టుకున్న అనంతరం రాందాస్ తండా శివారు లోని పంట పొలంలో ఉరి వేసుకున్నాడు. ఉద్యోగం లేక భార్యను పోషించలేననే బాధతో ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.