చిప్స్ తిని కూల్‌డ్రింక్స్ తాగిన యువకుడు కొద్ది సమయానికే ఊపిరాడక మృతి చెందాడు. వివరాలు.. పొల్లాచ్చికి చెందిన సతీష్. చెన్నై ఎగ్మూర్‌లో ఉన్న జిల్లా రెవెన్యూ అధికారి కార్యాలయంలో తాత్కాలిక ఉద్యోగిగా పని చేస్తున్నాడు. ఇతను చెన్నై ఈస్టుకోస్టు ఆలయానికి స్నేహితులతో కలసి వెళ్లి.. అక్కడ ఓ దుకాణంలో చిప్స్, కూల్‌డ్రింక్స్ తీసుకుని తరువాత సముద్రతీరంలో వెళ్లాడు.
అక్కడ కూర్చొని చిప్స్ తింటూ కూల్‌డ్రింక్స్ తాగాడు. కొద్ది సమయానికే గొంతులో సమస్యగా ఉందంటూ సతీష్ పడిపోవడంతో.. స్నేహితులు అతన్ని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళుతుండగా మార్గంమధ్యలో మృతి చెందాడు.