కోపంతో తల్లిని దారుణంగా చంపేశాడు

కోపంతో తల్లిని దారుణంగా చంపేశాడు

కని పెంచిన తల్లిపైనే ఓ కొడుకు అత్యంత కిరాతకంగా ప్రవర్తించాడు. మందలిందన్న కోపంతో తల్లిని దారుణంగా చంపేశాడు. హైదరాబాద్‌లోని సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిదిలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాపమ్మ ఆమె కుటుంబంతో కలిసి నివాసముంటోంది. అయితే అర్ధరాత్రి 2.30 గంటల సమయంలో కొడుకు సుధీర్‌ఎక్ససైజ్ చేస్తుండగా తల్లి మందలించింది. దీంతో ఆవేశానికి లోనైన సుధీర్ అత్యంత దారుణంగా ఇనుప రాడ్‌తో తల్లి తలపై బలంగా కొట్టాడు. అడ్డు వచ్చిన చెల్లెల్ని కూడా రాడ్‌తో కొట్టాడు. దీంతో ఇద్దరు రక్తపు మడుగులో పడిపోయారు.

ఇది గమనించిన ఇరుగురు పొరుగు వారు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న సుల్తాన్ బజార్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకునేలోపే తల్లి పాపమ్మ మృతిచెందింది. చెల్లికి తీవ్ర గాయాలయ్యాయి. తీవ్ర గాయాలైన చెల్లిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి, మృతి చెందిన పాపమ్మను మార్చురీకి తరలించారు. అయితే గతకొన్ని రోజులుగా సుధీర్ సైకోగా ప్రవర్తిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. సుధీర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.