ప్రేమ పేరుతో మోసపోయిన ఓ బీటెక్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సెల్ఫీ వీడియో తీసుకుంటూ ఎవరిని ప్రేమించకండి, చచ్చేదాకా మనతో ఎవరుంటారో వారినే ప్రేమించండి అంటూ తన మిత్రులకు బాయ్ చెప్తూ ఆత్మహత్యకు పాల్పడటం కలకలం సృష్టిస్తోంది.
వివరాల్లోకెళ్తే.. కరీంనగర్ జిల్లా సప్తగిరికాలనీకి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి సాయి మూడు రోజుల క్రితం సెల్ఫీ వీడియో తీసుకుంటూ పురుగుల మందు తాగాడు. వెంటనే స్థానికులు గుర్తించి అతన్ని ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఈ రోజు ప్రాణాలు కోల్పోయాడు. అయితే గతంలో ఓ అమ్మాయిని ప్రేమించిన సాయి.. ఆ అమ్మాయి తన ప్రేమను అంగీకరించకపోవడంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ప్రాణాలు కోల్పోయాక అతని సెల్ ఫోన్‌లో సూసైడ్‌కు ముందు తీసుకున్న సెల్ఫీ వీడియో బయటపడడంతో కుటుంబ సభ్యులతో పాటు మిత్రులు బోరున విలపించారు.