యాదాద్రి భువనగిరి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. అభిలాష్ అనే ఓ యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మంగళవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బెంగళూరుకు చెందిన ఓ కంపెనీలో అతను ఉద్యోగం చేస్తున్నాడు. కరోనా వైరస్ నేపథ్యంలో కొంత కాలంగా తన ఇంటివద్ద నుంచే వర్క్ ఫ్రమ్ హోం ద్వారా విధులు నిర్వహిస్తున్నాడు.
అయితే రెండు రోజుల అతన్ని సదరు కంపెనీ ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు సమాచారం అందించింది. ఉద్యోగం పోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన అభిలాష్ మణికట్టును కత్తితో కోసుకొని అనంతరం ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తమ కుమారుడి మృతిపై తల్లిదండ్రులు, కుటంబసభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలిస్తున్నారు.