ఆవేదనకు గురై యువతి ఆత్మహత్య

ఆవేదనకు గురై యువతి ఆత్మహత్య

నచ్చని పెళ్లి చేస్తున్నారని ఆవేదనకు గురైన ఓ యువతి ఆత్మహత్యకు యత్నించింది. ఆదివారం సాయంత్రం కాకినాడ ఆర్‌అండ్‌బీ సూపరింటెండెంట్‌ కార్యాలయం పైకి ఎక్కి కిందికి దూకేందుకు ప్రయత్నిస్తుస్తుండగా చూసిన వారు గమనించి ఆమెను రక్షించారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు, కాకినాడ సర్పవరం ఐడియల్‌ కళాశాల సమీపంలో నివాసం ఉంటున్న 21 ఏళ్ల దోబా దుర్గాదేవికి ఇంట్లో వారు నచ్చని పెళ్లి చేసేందుకు సిద్ధమయ్యారు. ఇదే విషయంపై కొద్ది రోజులుగా ఆమెకు కుటుంబ సభ్యుల మధ్య వాదనలు జరుగుతున్నాయి.

ఈ నేపథ్యంలో బాబాయి ఆమెపై చేయి చేసుకున్నాడు. ఆదివారం జరిగి ఈ ఘటనతో మనస్థాపం చెందిన యువతి ఇంటి నుంచి బయటికి వెళ్లిపోవాలని నిర్ణయించుకుంది. కాకినాడ కలెక్టర్‌ కార్యాలయానికి చేరుకుంది. అక్కడే ఉన్న ఆర్‌అండ్‌బీ సూపరింటెండెంట్‌ కార్యాలయంపైకి ఎక్కి కిందికి దూకే ప్రయత్నం చేస్తుండగా అక్కడి వారు గమనించి నిలువరించారు. అవుట్‌పోస్టు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు ఆమెను రక్షించి కిందికి దించారు. అక్కడికి చేరుకున్న త్రీ టౌన్‌ సీఐ కృష్ణ యువతితో మాట్లాడి కౌన్సెలింగ్‌ కోసం జీజీహెచ్‌లోని దిశ వన్‌స్టాప్‌ కేంద్రానికి తరలించారు.