పుట్టిన రోజే దుర్మరణం

పుట్టిన రోజే దుర్మరణం

ఓ వైపు చదువుకుంటూ..మరో వైపు పార్ట్‌టైమ్‌ జాబ్‌ చేస్తూ కుటుంబానికి అండగా ఉన్న యువతి తన పుట్టిన రోజే దుర్మరణం చెందింది. ఈ విషాద ఘటన హెబ్బాళ సంచార పోలీసుస్టేషన్‌ పరిధిలో శుక్రవారం జరిగింది.

హెబ్బాళ భద్రప్ప లేఔట్‌కు చెందిన మహశ్రీ..మల్లేశ్వరం ప్రభుత్వ కాలేజీలో చదువుతూ ఓ దుస్తుల దుకాణంలో పనిచేస్తోంది. శుక్రవారం పుట్టిన రోజు కావడంతో స్నేహితుడితో కలిసి బైకుపై వెళ్తుండగా భద్రప్పలేఔట్‌ వంతెన వద్ద అదుపు తప్పి కింద పడింది. ఆమెతలపై క్యాంటర్‌ దూసుకెళ్లడంతో తీవ్రంగా గాయపడి మృతి చెందింది. హెబ్బాళ ట్రాఫిక్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.