చంద్రబాబుపై సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న యువత

చంద్రబాబుపై సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న యువత

ప్రస్తుతం ఆంధ్ర రాష్ర్ర రాజకీయాల్లో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో మనం చూస్తూనే ఉన్నాము.వైసీపీ అధినేత వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఏపీలో ఎన్నడూ లేని విధంగా సమస్యలతో ప్రజలు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నారు.అలా ఇప్పుడు వాటన్నింటినీ మించి రాజధాని తరలింపు అనే సరికి ఒక్కసారిగా రాష్ట్రం అంతా నిప్పు రాజుకుంది.

రాజధాని తరలించవద్దని మహిళలే పెద్ద ఎత్తున గడప దాటి అడుగు బయట పెడుతున్నారంటేనే మనం అర్ధం చేసుకోవచ్చు.అయితే ఈ సమస్యను తనకు అనుకూలంగా మార్చుకోవాలని చంద్రబాబు ఎప్పటిలానే రంగులు మారుస్తున్నారు.సమయానికి అనుగుణంగా ఎలా అంటే అలా మాట తిప్పెయ్యడం బాబుకి కొత్తేమీ కాదు.

అలా ఇప్పుడు మాట్లాడుతున్న మాటలు ప్రతీ ఒక్కరూ గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.ఎందుకంటే ఇప్పుడు రాజధాని సమస్యను మరింత ఉధృతం చేయడానికి యువతను బయటకు రావాలని డిమాండ్ చేస్తున్నారు,ముఖ్యంగా విద్యార్థులను ఉద్దేశించి అంటున్నారు.అయితే ఈ మాట అడిగే హక్కు చంద్రబాబుకు లేదని సోషల్ మీడియాలో యువత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఎందుకంటే గతంలో “ప్రత్యేక హోదా” కోసం ఇదే యువత మరియు విద్యార్థులు బయటకు వస్తే వారిపై ఇదే చంద్రబాబు అధికారంలో ఉండి ఎలాంటి చర్యలు తీసుకున్నారు.అసలు ఎలా హోదా అనే అంశాన్ని పక్కదారి పట్టించి నీరుగార్చిన వారిలో మొట్ట మొదటి వారిగా మారారో అన్ని గుర్తున్నాయని అంటున్నారు.దాని మూలంగా ఇప్పుడు తన స్వార్ధ ప్రయోజనాల కోసమే యువతను మరియు విద్యార్థులను వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు.ఈ అంశాలను ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారో లేదో వారికే తెలియాలి.