తాలిబన్లు అఫ్ఘనిస్తాన్‌ను కైవసం చేసుకోవడంతో పలు సోషల్‌మీడియా నెట్వర్కింగ్ సంస్థలు కఠిన వైఖరిని అవలంభిస్తున్నాయి. తాలిబన్లపై ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ నిషేధం విధించిన విషయం తెలిసిందే. తాజాగా యూట్యూబ్, వాట్సాప్ కూడా కీలక నిర్ణయం తీసుకున్నాయి. తాలిబన్లకు చెందిన వీడియోలను యూట్యూబ్‌లో కన్పించే ప్రసక్తే లేదని వెల్లడించింది.
తాలిబన్లకు చెందిన వీడియోలను స్ట్రీమ్ చేయకుండా చేసే పాలసీ ఎప్పటినుంచో యూట్యూబ్ ఫాలో అవుతుందని పేర్కొంది. అదేబాటలో వాట్సాప్ కూడా పయనిస్తున్నట్లు తెలుస్తోంది. తాలిబన్లు కాబూల్‌ను నియంత్రణలోకి తీసుకోగానే అఫ్ఘన్లు తాలిబన్లను కాంటాక్ట్ అయ్యే ఫిర్యాదుల హెల్ప్‌లైన్‌ను మూసివేసింది. ఈ చర్యపై వాట్సాప్ వ్యాఖ్యానించడానికి వాట్సాప్ ప్రతినిధి నిరాకరించారు. కాగా యూఎస్ చట్టాల ప్రకారం తాలిబన్ల హెల్ప్‌లైన్‌ను నిలిపివేసింది.
హింస, దోపిడీ లేదా ఇతర సమస్యలను నివేదించడానికి అఫ్ఘన్ పౌరుల కోసం అత్యవసర హాట్‌లైన్ ఫిర్యాదుల సంఖ్యను మంగళవారం రోజున ఫేస్బుక్ ఇతర అధికారిక తాలిబాన్ ఛానెల్‌లతో పాటు బ్లాక్ చేసినట్లు నివేదిక తెలిపింది. ఫేస్బుక్ సోమవారం తాలిబాన్లను తీవ్రవాద గ్రూపుగా ప్రకటించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా తాలిబన్లకు సంబంధించిన కంటెంట్‌ను పూర్తిగా నిషేధించినట్లు పేర్కొంది. తాజాగా తాలిబన్లు నిర్వహించిన తొలి మీడియా సమావేశంలో ఫేస్బుక్ సెన్సాన్షిప్పై తాలిబన్ ప్రతినిధి అరోపణలు చేశారు.