ఉగాది వేడుకలకు వైఎస్ జగన్ డుమ్మా..

YS Jagan
YS Jagan

ఉగాది వేడుకలకు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ డుమ్మా కొట్టారు. ఉగాది పర్వదినం సందర్భంగా తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో ఉగాది సంబరాలు ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హాజరు కాలేదు. పార్టీ కార్యాలయ ఇంఛార్జ్ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ మంత్రి అంబటి రాంబాబులతో ఉగాది ఉత్సవాలను నిర్వహించారు. ఈ వేడుకలకు వైఎస్ జగన్ హాజరు కాకపోవడంపై ఆ పార్టీలో నేతలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.