Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
జగన్ కి కొడుకుల్లేరంటగా. రాజకీయ వారసత్వం ఎవరికి పోతుందో అని కొందరు వైసీపీ అభిమానులు అప్పుడప్పుడు అనుకోవడం మన చెవుల పడుతూనే ఉంటుంది. అయితే అలాంటి జగన్ అభిమానులంతా సంతోష పడే వార్త బయటికి వచ్చింది. అదే జగన్ పెద్ద కుమార్తె హర్ష లండన్ స్కూల్ అఫ్ ఎకనామిక్స్ లో సీట్ సంపాదించడం. ఈ విషయం జగన్ కుటుంబ సభ్యుల్ని ఆనందపరచడంలో విశేషం ఏముంది ? వైసీపీ శ్రేణులు ఇంతగా ఈ విషయాన్ని చర్చించుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. జగన్ కి ఇద్దరు కుమార్తెలు హర్ష ,వర్ష . ఈ ఇద్దరూ చదువుల్లో బాగా రాణిస్తున్నారు. అయితే వీరు ప్రచారానికి దూరంగా ఉండేలా జగన్ భార్య భారతీ రెడ్డి జాగ్రత్తలు తీసుకుంటారట.
ఇక హర్ష కి లండన్ స్కూల్ అఫ్ ఎకనామిక్స్ లో సీట్ రావడం గురించి వైసీపీ శ్రేణులు సంతోషపడటం వెనుక ఓ కారణం కనిపిస్తోంది. రాజకీయంగా జగన్ ని విమర్శించేటప్పుడు చంద్రబాబు ఆయన మీద కేసులు, అవినీతి గురించి ప్రస్తావించడమే కాదు,తన కొడుకు కోడలు లోకేష్, బ్రాహ్మణి బాగా చదువుకున్నారని చెప్పుకునే వారు. దీనికి కౌంటర్ ఇవ్వడం వైసీపీ కి కష్టంగా ఉండేది. తాజా పరిణామంతో మా వాళ్ళు కూడా బాగా చదువుకుని వస్తున్నారని చెప్పుకునే వీలుంది. మొత్తానికి హర్ష సాధించిన ఘనత తో జగన్ కంటే కూతుర్నే కనాలి అని పొంగిపోవడం సహజమే కదా.