టిడిపి పార్టీకి షాకుల మీద షాకులు ఇస్తున్న జగన్

టిడిపి పార్టీకి షాకుల మీద షాకులు ఇస్తున్న జగన్

టిడిపి పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పార్టీలో కీలక నేతలు పార్టీని విడగా  తాజాగా మరో నేత దేవినేని అవినాష్ టిడిపి పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా చేసిన కొద్ది గంటల్లోనే దేవినేని అవినాష్ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు . జగన్ సమక్షంలో కండువా కప్పుకున్నారు దేవినేని అవినాష్ . టీడీపీలో తమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని అందుకోసమే పార్టీని వీడుతున్నట్లు దేవినేని అవినాష్ తెలిపారు.

ఈ క్రమంలో రాజకీయాల్లో మరో చర్చ మొదలైంది. టిడిపిలో తమకు సరైన ప్రాధాన్యం ఇవ్వడం లేదని దేవినేని అవినాష్ వైసీపీలోకి చేరిన క్రమంలో  జగన్ ఎలాంటి ప్రాధాన్యత ఇస్తున్నారనే దానిపై చర్చ మొదలైంది. జగన్ దేవినేని అవినాష్ కు ఏదైనా హామీ ఇచ్చారా  కీలక బాధ్యత అప్పగించనున్నారా అనే చర్చ ప్రస్తుతం ఆంధ్ర రాజకీయాల్లో మొదలైంది. జగన్ నుంచి హామీ వచ్చాకే దేవినేని అవినాష్ టీడీపీని వదిలి వైసీపీలోకి చేరినట్లు చర్చించుకుంటున్నారు.

వైసీపీ లోకి వచ్చిన దేవినేని అవినాష్ కు తూర్పు నియోజకవర్గంలో పార్టీ బాధ్యతలు అప్పగిస్తానని చర్చించుకుంటున్నారు. ఎందుకంటే విజయవాడలోని మూడు నియోజకవర్గాల్లో తూర్పు మినహా మిగతా రెండు నియోజకవర్గంలో వైసీపీ పార్టీ విజయం సాధించిన విషయం తెలిసిందే. తూర్పు నియోజకవర్గంలో టిడిపి సీనియర్ నేత గద్దె రామ్మోహన్ వైసీపీ అభ్యర్థి భువన కుమార్ పై విజయం సాధించారు.

టిడిపి పార్టీకి షాకుల మీద షాకులు ఇస్తున్న జగన్

అంతే కాకుండా దేవినేని నెహ్రూకి తూర్పు నియోజకవర్గం లో అభిమానుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో అవినాష్ కు ఈ బాధ్యతలు అప్పగిస్తే పార్టీ కీ కలిసి వస్తుందని జగన్ భావిస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆయా నియోజకవర్గాల్లో ఇన్చార్జిగా ఉన్న భువన కుమార్, సీనియర్ నేత ఎలమంచిలి రవి పార్టీలోకి వచ్చిన కొత్త నేత దేవినేని అవినాష్ బాధ్యతలు అప్పగించడం పై ఇలా రియాక్ట్ అవుతారు అనే దానిపై కూడా చర్చ నడుస్తోంది. వీరిద్దరు ఆయనతో కలిసి పని చేస్తారా లేదా అన్నది కూడా ప్రస్తుతం అనుమానమే అన్న టాక్ వినిపిస్తుంది .

పార్టీలోకి వచ్చిన దేవినేని అవినాష్ కి ఎలాంటి కీలక పదవి కట్టబెట్టబోతున్నారూ ప్రస్తుతం ఆంధ్ర రాజకీయాల్లో ఆసక్తికర అంశంగా మారింది. దేవినేని అవినాష్ వర్గం కూడా టిడిపి పార్టీలో పదవులకు ప్రాధాన్యం లేదని చెప్తున్నారు. ఈ క్రమంలో దేవినేని అవినాష్ వర్గానికి వైసీపీ పార్టీలో ఎలాంటి ప్రాధాన్యం ఇస్తారు అని చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా జగన్ వ్యూహం తో రోజు రోజుకు టిడిపి కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడుతుంది కనిపిస్తోంది.