Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
వై.ఎస్ మరణం తర్వాత జరిగిన ఉపఎన్నికలు, 2014 అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో జగన్ మినహా ఆ కుటుంబ సభ్యులంతా బైబిల్ పట్టుకుని కనిపించేవారు. ఆ అస్త్రం ఉపఎన్నికల్లో సూపర్ హిట్ అయ్యింది. అసెంబ్లీ ఎన్నికల నాటికి సీన్ రివర్స్ అయ్యింది. వైసీపీ ఓటమికి ఎన్ని కారణాలు వున్నా ఇదే అంశం మీద జగన్ కన్ను పడింది. నంద్యాల, కాకినాడ ఎన్నికల తర్వాత జగన్ లో ఆ గిలి ఇంకా పెరిగింది. అసలే క్విడ్ ప్రోకో కేసులు,ముంచుకొస్తున్న 2019 సార్వత్రిక ఎన్నికలు …ఈ పరిస్థితుల్లో కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీ అండదండలు ఎంత అవసరమో జగన్ కి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల సమయంలో బీజేపీ బలపరిచిన అభ్యర్థులకు nda భాగస్వాముల కన్నా ముందే జగన్ మద్దతు ప్రకటించారు. అటు బీజేపీ కూడా చంద్రబాబుని కార్నర్ చేస్తూ జగన్ కి కన్ను కొడుతూనే వుంది. అయితే నంద్యాల, కాకినాడ ఎన్నికల తర్వాత బీజేపీ పునరాలోచనలో పడింది. ఈ పరిణామమే జగన్ ని కలవర పరుస్తోంది. అందుకే బీజేపీ ప్రాపకం కోసం వచ్చే ఎన్నికల్లో తమతో పొత్తు పెట్టుకుంటే 20 లోక్ సభ, 50 అసెంబ్లీ స్థానాలు ఇస్తాను అనేదాకా వెళ్లారు. అయినా బీజేపీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడంతో ఇప్పుడు కొత్త రూట్ ఎంచుకున్నారు.
బీజేపీకి మూలాలుగా చెప్పుకునే rss ,vhp ద్వారా పని చక్కబెట్టుకోవాలని జగన్ భావిస్తున్నారు. అయితే అక్కడ వై.ఎస్ కుటుంబం మీద వున్న క్రైస్తవ ముద్ర అడ్డుగా నిలుస్తోంది. దీంతో ఆ సంస్థల్ని ఎంతోకొంత ప్రభావితం చేయగలిగే సత్తా కలిగి, సీఎం చంద్రబాబు మీద వ్యతిరేకత వున్న స్వామీజీలతో మ్యాటర్ సెటిల్ అవుతుందని జగన్ కి ప్రశాంత్ కిషోర్ సలహా ఇచ్చారట. అందుకే శారద పీఠాధిపతి స్వరూపానంద, శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామి తదితరుల్ని కలవడమే కాదు వారికి పాద నమస్కారాలు చేస్తున్నారు. ఓ విధంగా చెప్పాలంటే బీజేపీ గమ్యాన్ని చేరుకోడానికి వయా స్వామీజీ ల ద్వారా జగన్ జర్నీ ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ ప్లాన్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో వేచి చూడాలి.