కాంగ్రెస్ కి కెసిఆర్ కొట్టిన దెబ్బే బీజేపీ కి జగన్ కూడా.

Ys Jagan will Give Big Shock to BJP same Like as KCR

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తెలంగాణ సాధన కోసం బొంత పురుగునైనా ముట్టుకుంటామని చెప్పిన తెరాస అధినేత కెసిఆర్ కాంగ్రెస్ తో విలీనం లేదా పొత్తుకు సిద్ధం అని చెప్పకనే చెప్పారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కెసిఆర్ మాటలు, ప్రకటనలు ఆ విధంగానే వున్నాయి. కాంగ్రెస్ నాయకులూ అదే విధంగా ఆలోచించారు. తెలంగాణ ప్రకటన అనంతరం కెసిఆర్ కుటుంబ సభ్యులు 10 జన్ పథ్ లో ఫోటోలు దిగడం చూసాక ఇక విలీన ప్రకటన లాంఛనమే అనుకున్నారు అంతా. కానీ రాత్రికి రాత్రి సీన్ మారిపోయింది. తెరాస ఒంటరి పోరుకు సిద్ధం అయ్యిది. ప్రజలు కూడా తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కన్నా తెలంగాణ కోసం పోరాడిన తెరాస వైపే మొగ్గుజూపారు. ఇదంతా చూసాక అవసరం తీరాక కాంగ్రెస్ ని కెసిఆర్ ఎలా దెబ్బ కొట్టాడో అర్ధం చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకో జాతీయ పార్టీ బీజేపీ కి కూడా ఇదే అనుభవం ఎదురు కాబోతోందా ? ఆంధ్రప్రదేశ్ లో పరిణామాలు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. అయితే ఈసారి క్షేత్రం తెలంగాణ కాదు ఆంధ్రప్రదేశ్. కాంగ్రెస్ ప్లేస్ లో బీజేపీ ఉంటే కెసిఆర్ స్థానంలో వైసీపీ అధినేత జగన్ కనిపిస్తున్నారు.

Nda లో టీడీపీ కొనసాగుతున్న రోజుల్లోనే ఆ బంధం విడిపోవడానికి వైసీపీ గట్టి ప్రయత్నం చేసింది. చివరకు వాళ్ళు అనుకున్నది సాధించారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా మోడీ తిరిగి ప్రధాని అవుతారు అన్న నమ్మకం తోటే వైసీపీ ఇంత ప్రయత్నం చేసింది. అయితే కాలంతో పాటు పరిస్థితులు మారాయి. బీజేపీ తో వైసీపీకి లోపాయికారీ బంధం అయితే ఏర్పడింది కానీ మోడీ తిరిగి ప్రధాని అవుతారన్న నమ్మకం మాత్రం రోజురోజుకి సడలిపోతోంది. ఈ విషయం జగన్ కి కూడా అర్ధం అవుతోంది. అయితే కేసుల అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని ఆ బంధం అలా కొనసాగించి వచ్చే ఎన్నికల తర్వాత బీజేపీ కి హ్యాండ్ ఇద్దామని వైసీపీ లో చర్చ సాగుతోందట. అదే నిజం అయితే జగన్ కి కేసుల విషయంలో ఉపయోగపడ్డ బీజేపీ చివరకు అటుఇటు కాకుండా అయిపోతుంది అన్న మాట. ఈ విధంగా తనదే పై చేయి అనుకుంటూ బీజేపీ… వైసీపీ చేతిలో మోసపోయే సూచనలు మెండుగా కనిపిస్తున్నాయి.