ఏపీ పోలీసు అధికారులకు మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ వార్నింగ్ ఇచ్చారు. ఎల్లకాలం టీడీపీ పాలన కొనసాగదని.. చంద్రబాబుకు ఊడిగం చేసేవారికి శిక్ష తప్పదన్నారు. తాము అధికారంలోకి వచ్చాక అలాంటి పోలీసు అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. యూనిఫామ్ తీయించి చట్టం ముందు నిలబెడతామన్నారు. కాగా టీడీపీ నాయకుల అరాచకాలతో ఏపీలో బిహార్ లాంటి పరిస్థితులు ఏర్పాడ్డాయని విమర్శించారు. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన చేస్తూ శాంతి భద్రతలను సీఎం చంద్రబాబు ఎందుకు గాలికొదిలేశారని ప్రశ్నించారు. రాప్తాడు నియోజకవర్గంలో జరుగుతున్న అరాచకాలు రెడ్‌బుక్ పాలనకు నిదర్శనమన్నారు.





