రాజకీయ ప్రయోజనాల కోసమే ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ డ్రామా అని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల విమర్శించారు. వానాకాలం వడ్ల కొనుగోళ్లు వదిలేసి ఢిల్లీకి పయనం కావడంపై గురువారం ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు.
కేంద్ర ప్రభుత్వంతో అమీతుమీ తేల్చుకుంటానని చెప్పిన కేసీఆర్.. ఖాళీ చేతులతో తిరుగు ప్రయాణమయ్యారన్నారు. కొనుగోళ్లలో జాప్యంతో అన్నదాతల గుండెలు ఆగుతున్నాయని ఆం దోళన వ్యక్తం చేశారు.