జగన్‌, భారతి ఆరోపణలు ఖండిస్తున్నా… YS Vijayamma

YS Vijayamma
YS Vijayamma

జగన్ పిటిషన్‌పై విజయలక్ష్మి, షర్మిల ఘాటు కౌంటర్ – కుటుంబ వివాదం కోర్టు గదికి

వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి వేసిన పిటిషన్‌పై ఆయన తల్లి వైఎస్ విజయలక్ష్మి మరియు చెల్లి వైఎస్ షర్మిల ట్రైబ్యునల్‌లో ఘాటు కౌంటర్ దాఖలు చేశారు. జగన్, భారతి చేసిన ఆరోపణలు నిరాధారం అని, కుటుంబ వ్యవహారాలను ఎన్‌సీఎల్‌టీ పరిధిలోకి తేనెలేదు అని స్పష్టం చేశారు. సరస్వతి పవర్ షేర్ల బదలాయింపు 2019లో కుటుంబ ఒప్పందం ప్రకారమే జరిగిందని తెలిపారు. కోర్టు గదిలో తాను నిలబడాల్సి రావడం బాధాకరమని విజయలక్ష్మి వ్యాఖ్యానించారు. జగన్ రాజకీయ ఉద్దేశంతో తప్పుడు కేసు వేశారని వారు ఆరోపించారు.

సరస్వతి పవర్ షేర్ల వివాదంపై విచారణ – మార్చి 6కు వాయిదా

జగన్ పిటిషన్‌పై ఎన్‌సీఎల్‌టీ సోమవారం విచారణ చేపట్టింది. ఆయన తరఫున న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. విజయలక్ష్మి, షర్మిల తాము కౌంటర్లు ఆన్‌లైన్‌లో దాఖలు చేశామని, త్వరలో భౌతికంగా సమర్పిస్తామని తెలిపారు. కుటుంబ వివాదాన్ని కంపెనీ వివాదంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారంటూ వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న ట్రైబ్యునల్, తదుపరి విచారణను మార్చి 6కు వాయిదా వేసింది.