చేవచచ్చిన నేతలు చేసేదేముంది..?

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

కాంగ్రెస్ లో దిగ్గజాల్లాంటి నేతలు కూడా మొన్నటి ఎన్నికల్లో మట్టికరిచారు. ముఖ్యంగా ఏపీలో హస్తం అడ్రస్ గల్లంతైంది. ఇలాంటి సమయంలో కాంగ్రెస్ పాతకాపులంతా జగన్ వైపు చూస్తున్నారట. నంద్యాలలో జగన్ గెలుస్తారని ఆశలు పెట్టుకుంటే.. సీన్ రివర్స్ అయిందని వీరంతా మథనపడుతున్నారు.

అందుకే జగన్ పంచన చేరి బాబును ఓఢించాలని కంకణం కట్టుకుంటున్నారట. కానీ వీరందర్నీ నిజంగా జగన్ తన పార్టీలో చేర్చుకుంటే.. ఆయనకు అంతకంటే పెద్ద మైనస్ మరొకటి ఉండదని కామెంట్లు పడుతున్నాయి. కాంగ్రెస్ నేతల్ని చూస్తేనే జనం అసహ్యించుకుంటున్నారని నంద్యాల ఓటర్ల మూడ్ చూస్తే అర్థమైంది.

అలాంటి వారందర్నీ చేరదీస్తే.. జగన్ కు ఉన్న క్రేజ్ పోవడం ఖాయమని వైసీపీ నేతలే భావిస్తున్నారు. పైగా చంద్రబాబును తక్కువ అంచనా వేసే ఇప్పుడు జగన్ బొక్క బోర్లా పడ్డారు. మళ్లీ కెలుక్కుంటే ఈసారి మొన్న గెలిచిన సీట్లు కూడా నిలవవని చెబుతున్నారు నేతలు. ఇప్పటికైనా చంద్రబాబు వ్యూహాలను జగన్ స్టడీ చేయాలని, రాజకీయ ప్రత్యర్థి అయినా చంద్రబాబు పోల్ మేనేజ్ మెంట్ ను అన్ని పార్టీలు ప్రశంసిస్తాయని వారు గుర్తుచేస్తున్నారు.

మరిన్ని వార్తలు:

మరో సర్జికల్ స్ట్రైక్స్ కు రెడీ

చీకూ ఇప్పుడిక ఛేజ్ మాస్ట‌ర్