చీకూ ఇప్పుడిక ఛేజ్ మాస్ట‌ర్

Virat Kohli new name Chage master

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

భార‌త్ క్రికెట్లో ఇప్పుడు విరాట్ కోహ్లీ శ‌కం న‌డుస్తోంద‌ని చెప్పొచ్చు. అటు కెప్టెన్ గానూ, ఇటు బ్యాట్స్ మెన్ గానూ ఘ‌న విజ‌యాలు అందుకుంటూ అత్యుత్త‌మ ద‌శ‌లో ఉన్నాడు కోహ్లీ. దేశంలో ఇప్పుడు ఎక్కువ‌మంది అభిమానించే క్రికెట‌ర్ విరాట్ కోహ్లీనే. అరంగేట్రం నుంచే అద‌ర‌గొట్టిన కోహ్లీని అభిమానులు ఎప్ప‌టినుంచో అనేక ముద్దు పేర్ల‌తో పిలుచుకుంటున్నారు. చీకూ, ఇండియ‌న్ ర‌న్ మిష‌న్‌, ప‌రుగుల వీరుడు ఇలా ఎన్నో ముద్దుపేర్లున్నాయి కోహ్లికి. తాజాగా ఆయ‌న‌కు ఐసీసీ సైతం ఓ బిరుదిచ్చింది. దాని పేరు ఛేజ్ మాస్ట‌ర్‌.

క్రికెట్లో ఛేజింగ్ ను ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డే కోహ్లిని ఛేజ్ మాస్ట‌ర్‌గా అభివ‌ర్ణించింది ఐసీసీ. సాధార‌ణంగా భార‌త్ క్రికెటర్లు ముందుగా బ్యాటింగ్ చేయ‌టానికి ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డుతుంటారు. కెప్టెన్లు కూడా ఎక్కువ‌మంది టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకుంటారు. కానీ కోహ్లీ వారికి భిన్నంగా ఫీల్డింగ్ ఎంచుకుంటాడు. ఛేజింగ్ లో కోహ్లి అల‌వోక‌గా ప‌రుగులు సాధిస్తాడు. కోహ్లి కెరీర్ లో ఎక్కువ ప‌రుగులు ఛేజింగ్ ద్వారా వ‌చ్చిన‌వే. ఒక్క టీ 20ల్లోనే ఛేజింగ్ లో కోహ్లి 1,016 ప‌రుగులు చేశాడు. భార‌త్, శ్రీలంక మ‌ధ్య బుధ‌వారం జ‌రిగిన ఏకైక టీ 20లోనూ ఛేజింగ్ లో 82 పరుగులు చేసి జ‌ట్టుకు విజ‌యాన్ని అందించాడు. ఈ మ్యాచ్ గురించి వివ‌రిస్తూ ఐసీసీ ఛేజ్‌మాస్ట‌ర్ విరాట్ కోహ్లీ 82 ప‌రుగుల ఇన్నింగ్స్ తో భార‌త్ 7 వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది అని తెలిపింది. ఐసీసీ బిరుదుతో ఇక‌పై అభిమానులంద‌రూ కోహ్లీని ఛేజ్ మాస్ట‌ర్ అని పిలుచుకుంటారన్న‌మాట‌.

మరిన్ని వార్తలు:

యుద్ధం శరణం… ప్రివ్యూ

మేడ మీద అబ్బాయి… ప్రివ్యూ.

తిల‌క్‌…మీకిదే నా సెల్యూట్‌