Sports: నేడు మొదటి టీ20.. కీలక ఆటగాడు దూరం…!

Sports: Today is the first T20.. the key player is away...!
Sports: Today is the first T20.. the key player is away...!

ఇవాళ ఇండియా మరియు ఆఫ్ఘన్‌ జట్ల మధ్య మొదటి టీ20 మ్యాచ్‌ జరుగనుంది. ఆఫ్ఘనిస్తాన్, భారత జట్ల మధ్య జరిగే తొలి టీ20 మొహలీ వేదికగా జరుగనుంది. అయితే.. నేడు ఆఫ్ఘనిస్తాన్, భారత జట్ల మధ్య జరిగే తొలి టీ20లో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ జరిగే మొహాలీ పిచ్ బ్యాటింగ్ కు అనుకూలిస్తుంది.

ఒకవేళ మొదట బ్యాటింగ్ చేసిన జట్టు భారీ స్కోర్ చేస్తే చేదనలోను అదే జోరు కనిపించే ఛాన్స్ ఉంది. ఎందుకంటే…. ఇక్కడ 6 మ్యాచులు జరిగితే నాలుగింట్లో ఛేజింగ్ చేసిన జట్లే గెలిచాయి. ఇక భారత్ ఇక్కడ 4 టీ20ల్లో 3 నెగ్గింది. ఆస్ట్రేలియా చేతిలో 2022లో ఓడింది. ఇక ఈ మ్యాచ్‌ కు కోహ్లీ దూరం కానున్నాడు. ఇవాళ సాయంత్రం 7.30 గంటలకు ఇండియా మరియు ఆఫ్ఘన్‌ జట్ల మధ్య మొదటి టీ20 మ్యాచ్‌ ప్రారంభం కానుంది.