రైల్వే సాక్షిగా వైసీపీ స్కెచ్ ?

ysrcp elections sketch sakshi news paper kept in trains

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఇప్పటికే సోషల్ మీడియా లో అధికార టీడీపీ ని ముప్పుతిప్పలు పెడుతున్న వైసీపీ చంద్రబాబు సర్కార్ మీద ప్రచారానికి రైల్వేని కూడా తెలివిగా వాడుకుంటోంది. మీరు ఎప్పుడైనా గమనించారో లేదో ఏపీ మార్గంలో వెళ్లే అన్ని రైళ్లలో ఎక్కువ మంది ప్రయాణికులు సాక్షి పేపర్ చదువుతూ కనిపిస్తారు. అలా చదివే వారంతా ఆ పేపర్ కొన్నారు అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఆ పత్రిక యాజమాన్యం చేస్తుందో ఇంకెవరైనా వైసీపీ అభిమానులు చేస్తున్నారో గానీ ఎక్కువ రద్దీ వుండే రైల్ మార్గాల్లో ఒక్కో బోగీలో రెండు సాక్షి పేపర్లు అలా పడిపోతాయి. ఎవరికి వారు ఆ పత్రికల్ని చదువుతారు. ఏ పక్క వారిదో ఈ పేపర్ అనుకుంటారు. కానీ నిజం అది కాదు. ఓ పద్ధతి ప్రకారం రైల్వే లో సాక్షి పత్రికలు ఇలా వదిలేస్తున్నారు. ఓ విధంగా చెప్పాలంటే ఒక్కో రైల్వే భోగీ లో కేవలం పదంటే పది రూపాయల ఖర్చు పెట్టి సాక్షి ద్వారా ప్రభుత్వం మీద ప్రజా వ్యతిరేకత పెంచడానికి ప్రయత్నిస్తున్నారు.

సహజంగా ఈ తరహా ట్రిక్స్ ఎవరూ గమనించరు. అయితే నిత్యం రైల్ ప్రయాణం ద్వారా తమ కార్యాలయాలకు వెళ్లే ప్రభుత్వ ఉద్యోగులు కొందరు ఈ గుట్టు కనిపెట్టారు. సహజంగా ఇలాంటి రూట్స్ లో ఉద్యోగులు ఒకరికి ఒకరికి పరిచయం అవుతారు. వారు ఎక్కే బోగీల్లో నిత్యం సాక్షి పేపర్ కనిపిస్తుంది. చివరకు దిగేటప్పుడు చూస్తే ఎవరిని అడిగినా ఈ పత్రిక మాది కాదంటే మాది కాదంటారు. ఇలా కొన్నాళ్ళు జరిగాక గమనిస్తే ఇదేదో ఓ వ్యూహం ప్రకారం జరుగుతున్న పబ్లిసిటీ స్టంట్ అని తేలిందట. ఏదేమైనా మీడియాని వాడుకోవడంలో వైసీపీ భలే క్రియేటివ్ ఐడియాస్ తో ముందుకు వెళుతోంది.

మరిన్ని వార్తలు 

హలో చైనా… ప్యాటన్ నగరాన్ని మరిచిపోయారా..?

ట్వీటుతోనే హీటు పుట్టిస్తున్న కమల్

మాయావతికి లాలూ ఆఫర్ వెనుక మర్మమేంటి..?