రాజీకీయం చేద్దామనుకున్నారు కానీ పోలీసులు తేల్చేశారు…!

YSRCP-Leader-Kesava-Reddy-K

అనంతపురం జిల్లా వైసీపీ నేత, ఆత్మకూరు మాజీ సర్పంచ్ కేశవరెడ్డి హత్య పెను సంచలన రేపిన సంగతి తెలిసిందే. ఆయన్ని గుర్తు తెలియని దుండగులు వేటకొడవళ్లతో దాడి చేసి చంపడంతో ఆ హత్యను రాజకీయంగా వాడుకోవడానికి వైసీపీ సిద్దమయిపోయింది. ముందు నుండీ కుటుంబసభ్యుల మధ్య ఉన్న పాత కక్షలు, ఆస్తి తగాదాలే ఈ హత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తూ వస్తున్నా వైసీపీ మాత్రం ఇది రాజకీయ హత్య అని, మంత్రి పరిటాల వర్గీయులే ఆయన్నీ చంపారని ఆరోపిస్తూ వచ్చింది.కేశవరెడ్డికి, అతడి అన్న నర్సింహారెడ్డికి మధ్య రెండేళ్లుగా ఆస్తి తగాదాలు నడుస్తున్నాయని, ఈ నేపథ్యంలోనే హత్య చేసి చంపారని మృతుడి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నా అవేమీ పట్టని వైసీపీ ఆరోజున నిరాధార ఆరోపణలు చేస్తూ వచ్చింది. అయితే తాజాగా ఈ కేసు మిస్టరీ చేదించిన పోలీసులు కుటుంబ కలహాలతోనే కర్నూలు జిల్లా ఆత్మకూరులో వైసీపీ నేత కేశవరెడ్డిని హత్య చేశారని తెలిపారు.

kesava-reddy-murder

కేశవరెడ్డిని స్వయంగా ఆయన అన్న కుమారుడు నరసింహారెడ్డి, వారాదప్ప అలియాస్ వెంకటేశులు, విశ్వనాథరెడ్డి కలిసి హత్య చేశారని వెల్లడించారు. ఇరు కుటుంబాల మధ్య ఉన్న ఆస్తి తగాదాలే ఈ హత్యకు ప్రధాన కారణమన్నారు. ఆస్తితో పాటు చిన్నచిన్న గొడవలు చెలరేగిన నేపథ్యంలో నరసింహారెడ్డి కేశవరెడ్డి హత్యకు ప్లాన్ వేశాడన్నారు.
ఇందులో భాగంగా హత్య చేసేందుకు వారాదప్పను నరసింహారెడ్డి సంప్రదించాడని అన్నారు. హత్యకు రూ.10 వేలకు ఒప్పందం చేసుకుని అడ్వాన్సుగా రూ.వెయ్యి చెల్లించాడని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత కర్నూలుకు వెళ్లిన వీరు వేట కొడవళ్లను కొనుగోలు చేశారు. ఈ నేపథ్యంలో ఈ నెల 10న తోటకు వెళ్లి వస్తున్న కేశవరెడ్డిపై వేట కొడవళ్లతో దాడిచేశారు. అనంతరం ఓ బండరాయితో తలపై మోది అక్కడి నుంచి పారిపోయారు. చివరికి వారి దాడి నుంచి కొనప్రాణాలతో తప్పించుకున్న కేశవరెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఈ కేసులో నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

murder