అరెస్ట్ లతో బంద్ బంద్…రోజా కూడా !

ప్రత్యేక హోదా సాధన కోసం నేడు రాష్ట్ర బంద్ కి పిలుపునిచ్చిన వైసీపీ దానిని విజయవంతం చేయడానికి ప్రయత్నాలు చేస్తోంది. హోదా సాధనే లక్ష్యంగా ఆ పార్టీ అధినేత జగన్ పిలుపుతో.. వైసీపీ శ్రేణులు బంద్‌లో ఉత్సాహంగా పాల్గొంటున్నాయి. ఉదయం నుంచే 13 జిల్లాల్లో పార్టీ కార్యకర్తలు రోడ్డెక్కారు. డిపోల ముందు బైఠాయించి బస్సులు బయటకు రాకుండా అడ్డుకుంటున్నారు. అలాగే షాపుల్ని కూడా మూసివేయించారు. కొన్ని జిల్లాల్లో పార్టీ కార్యకర్తలు భారీ ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు చేపడితే కొన్ని జిల్లాల్లో రోడ్లపై బైఠాయించి ఆందోళనలు చేస్తున్నారు.

అరెస్ట్ లతో బంద్ బంద్...రోజా కూడా ! - Telugu Bullet

విజయవాడలో వైసీపీ నేతలు బస్సుల్ని అడ్డుకోవడంతో ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. విజయవాడ మాత్రమే కాకుండా కృష్ణాజిల్లావ్యాప్తంగా వైసీపీ ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు. గుంటూరు జిల్లాల్లో కూడా బంద్ కొనసాగుతోంది. శ్రీకాకుళం జిల్లాలోనూ వైసీపీ నేతలు ఆందోళనలు చేస్తున్నారు. ప్రకాశం జిల్లాలో కూడా వైసీపీ ఆధ్వర్యంలో బంద్ కొనసాగుతోంది. ప.గో జిల్లాలోని ఎనిమిది డిపోల్లో బస్సులు నిలిచిపోయాయి. ఇక మిగిలిన ఉత్తరాంధ్రతో పాటూ రాయలసీమ జిల్లాల్లోనూ బంద్ ప్రభావం పాక్షికంగా కనిపిస్తోంది.

అరెస్ట్ లతో బంద్ బంద్...రోజా కూడా ! - Telugu Bullet
వైసీపీ బంద్‌ పిలుపుతో ముందస్తుగా మాజీ మంత్రి, వైసీపీ నేత బాలినేని శ్రీనివాసరెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. చిలకలూరిపేటలో వైసీపీ నేత మర్రి రాజశేఖర్‌ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. సత్తెనపల్లిలో అంబటి రాంబాబునర్సరావుపేటలో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్‌ రెడ్డిలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నగర నియోజకవర్గంలో పుత్తూరులో బంద్‌లో పాల్గోన్న వైఎస్సార్సీ మహిళనేత ఆర్కే రోజాతో సహా ఎమ్మెల్యే నారాయణస్వామిని పోలీసులు అరెస్ట్‌ చేశారు

అరెస్ట్ లతో బంద్ బంద్...రోజా కూడా ! - Telugu Bullet