రోజా ఐరన్ లెగ్గే అంటున్న ప్రశాంత్ కిషోర్

YSRCP political advisor Prashant kishor comments on MLA roja

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

ఇంతకాలం అందరూ రోజాను ఐరన్ లెగ్ అంటుంటే అనవసరంగా ఆడిపోసుకుంటున్నారని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు ఎక్కడో పక్క రాష్ట్రం నుంచి వచ్చిన ప్రశాంత్ కిషోర్ కూడా సర్వే చేసి మరీ అదే నిజమని తేల్చారట. రోజాలాగా నోరు పారేసుకునేవారిపై ప్రజల్లో మంచి అభిప్రాయం ఉండదని, అర్జెంట్ గా అధికార ప్రతినిధిని మార్చాలని జగన్ కు సూచించారట.
ఈ విషయం తెలిసిన రోజాకు నోట మాట రాలేదట. ఇప్పటిదాకా సన్నిహితులు ఎంత మొత్తుకుంటున్నా… నోరేసుకుని అందరి మీదా పడిపోతున్న రోజాకు వాస్తవం ఇప్పుడే తెలిసొస్తోంది. కానీ ఇప్పటికే లేటైపోయిందంటున్నారు వైసీపీ సీనియర్లు. జగన్ రోజాను దూరం పెట్టడానికి కసరత్తు చేస్తున్నారట. రోజా స్థానంలో మరో సమర్థ నేత కోసం వెతుకుతున్నారు.

సరైన నేత కనిపించగానే… రోజా తెరమరుగు కావడం ఖాయం. ఇక ఎప్పటిలాగే జబర్దస్త్ షో లకే రోజా పరిమితం కావడమే మిగిలిందని ఆమె నియోజకవర్గ క్యాడర్ కూడా మండిపడుతున్నారు. ఎమ్మెల్యే స్థాయిలో గౌరవంగా, హుందాగా ఉండకుండా బజారుమనిషిలా తిట్లు, ఎవరూ వినలేని, అనకూడని మాటలు ఉపయోగించడం, అసెంబ్లీ సాక్షిగా సీఎంనే తిట్టండ రోజా గ్రాఫ్ ను పూర్తిగా తగ్గించేశాయని వేరే చెప్పే పనేలేదు. కాకపోతే ప్రశాంత్ కిషోర్ రాష్ట్రానికి కొత్త కాబట్టి… సర్వే చేసి చెప్పారు. అంతే తేడా.