పవన్‌ మీద ‌వైసీపీ కుట్ర… శ్రీరెడ్డి ఓ పావు… ఆధారంతో సహా బట్టబయలు ?

YSRCP provokes Sri Reddy against Pawan Kalyan

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

తనని సినిమా అవకాశాలు ఇప్పిస్తానని వాడుకున్నారని, ఇదే చాలామనది అమాయకులయిన అమ్మాయిలకి జరుగుతుందని తెలుగు సినీ ఇండస్ట్రీలోనే క్యాస్టింగ్ కౌచ్ అనే జాడ్యాన్ని వదిలిస్తానని, అలాగే తాను చెప్పిన కొన్ని కమిటీలని వెంటనే ఏర్పాటు చేయాలంటూ శ్రీ రెడ్డి పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే పోరాటం పేరుతో మీడియా ముందుకు వచ్చిన శ్రీరెడ్డి ప్రధాన లక్ష్యం నెరవేరింది. ఎలా అంటే ఆమె కోరిన క్యాష్ కమిటీ ని ‘మా’ ఏర్పాటు చేసింది అలాగే తనకి సినిమా అవకాసాలకి ‘మా’ సహాయం చేస్తానని మాట ఇచ్చింది, అలాగే ‘మా’ సభ్యత్వం కూడా ఇస్తానని ఒప్పుకుంది. ఇంత జరిగాక ఆమె సైలెంట్ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఆశ్చర్యకరంగా శ్రీరెడ్డి కొద్ది రోజుల నుండి ఓయు అలాగే కొందరు నేతలని కలిసి తన ఉద్యమానికి మద్దతు కోరుతూ వస్తోంది, అయితే ఇక్కడి వరకు బాగానే ఉన్నా ఒకవేళ ఏదయినా అన్యాయాన్ని పోలీస్ స్టేషన్లు, కోర్టుల దృష్టికి తీసుకువెళ్ళాలి కానీ ఇలా చానెల్స్ ముందుకి వస్తే సమస్య తీరదు కదా అన్న పవన్‌ మాటలకు ఆమె అనూహ్యంగా ఎదురు దాడి ప్రారంభించింది. అప్పటి నుండి ఆమె పవన్ మీద ఆరోపణలు గుప్పిస్తోంది.

ముందు పవన్ కల్యాణ్ గారు… మీరు స్పెషల్ స్టేటస్ కోసం రోడ్ల మీదకు వచ్చి ఎందుకు ఆందోళన చేస్తున్నారు… మీరు కూడా కోర్టులకి… పోలీస్ స్టేషన్‌కి వెళ్లొచ్చు కదా అని మొదలు పెట్టిన శ్రీ రెడ్డి, నిన్ను అన్నా అన్నందుకు చెప్పుతో కొట్టుకోవాలంటూ మీడియా ముందే చెప్పుతో కొట్టుకుంది. మూడు పెళ్లిళ్లు చేసుకున్న నీకు మహిళలంటే గౌరవం ఉందా… ఇలాంటి వ్యక్తి జనానికి ఏం సేవ చేస్తాడంటూ ప్రశ్నించింది… ఇకపై పవన్‌ని ఎవరూ అన్నా అని పిలవొద్దని… ఆయనకు మహిళలు ఎవరు ఓటు వేయొద్దని చెప్పింది. అంతటితో ఆగకుండా పవన్ ని ఒక అసభ్య పదంతో కూడా దూషించింది. ఒకరకంగా చూస్తే క్యాస్టింగ్ కౌచ్‌పై స్పందించిన ఏకైక తెలుగు స్టార్ హీరో పవన్ కళ్యాణ్ ఒక్కడే. చట్టాల ద్వారానే న్యాయం జరుగుతుంది… మీడియా ఛానెళ్ల ద్వారా కాదమ్మా అంటూ ఆయన తన అభిప్రాయమేంటో చెప్పాడు… మరి ఇందులో ఆమె కోపగించుకోవాల్సిన అంశం ఇక్కడ అణుమాత్రంగా కూడా లేదు. కాని ఆమె ఒకరోజు మాములుగా ఉంది రెండో రోజు పవన్ ని అంత పెద్ద పదంతో దూషించడం పెను ప్రకంపనలే రేపింది.

ఇవి ఆమె మాట్లాడిన మాటలు కావని ఎవరో ఆమె వెనుకనుంచి ఇది చేయిస్తున్నారు అని భావించారు అందరూ, అయితే తమకు ఎదురు తిరిగారన్న ఆగ్రహంతో తెలుగుదేశం వాళ్లే పవన్‌పై బురద జల్లేందుకు ఇలా చేయిస్తున్నారని పవన్ అభిమానులు కొందరు విమర్శిస్తున్న తరుణంలో ఇష్యూలోకి వైసీపీ ఎంట్రీ ఇచ్చింది. వైసీపీ అవనిగడ్డ ఇంచార్జ్ సింహాద్రి రమేష్ ఆఫీస్లోనూ, కత్తి మహేశ్‌తో ఫోటోలలోనూ ఉన్న ఓ మహిళ… అప్పటి ప్రెస్ మీట్ లో శ్రీరెడ్డి పక్కన నిల్చోవడం పలు అనుమానాలని రేకెత్తించింది. అయితే వాటన్నింటిని తెర దించుతూ శ్రీరెడ్డి తన స్నేహితురాలు, తమన్నాతో మాట్లాడిన ఫోన్ కాల్ బయటకు లీక్ ఐంది.   మహేష్ తో, వైసేపీ ఆఫీస్లలో ఫోటోలలో ఉన్న ఆమె పేరే తమన్నా. ఫోన్ సంభాషణ చివర్లో శ్రీరెడ్డి పవన్ కళ్యాణ్ గురించి తమన్నాతో మాట్లాడిన విషయాలు చూస్తుంటే పవన్ కళ్యాణ్ పై, జనసేన పార్టీపై భారీ కుట్ర జరుగుతుందా అనే అనుమానాలు కలగక మానదు. శ్రీరెడ్డి తన పోరాటాన్ని ఢిల్లీ వేదికగా చేయబోతున్నట్లు ఈ ఫోన్ సంభాషణలో తెలిపింది.

రాంగోపాల్ వర్మ పెద్ద ప్లాన్ వేశాడని, ఐదు కోట్లు డబ్బులు తీసుకోమన్నాడని పవన్ కళ్యాణ్ ని తిట్టమని చెప్పింది వాడే(వర్మ) నని ఆమె ఫోన్ లో తెలిపింది. వైసిపి వాళ్ళు ప్లాన్ వేసుకుని వచ్చారు, నా ఏడుపు చూసి తగ్గారు, లేకపోతే మరింత ఇరుక్కుపోయేదాన్ని అని చెప్పడం చూస్తోంటే దీని వెనుక వైసీపీ పెద్దలు ఉన్నారని అర్ధం అవుతోంది. కాని ఈ విషయాన్ని వర్మతో ఎందుకు చెప్పించారు అనేది ఇప్పుడు ఆలోచించాల్సిన విషయం. లక్ష్మీస్ ఎన్టీఆర్ నిర్మాత వైసీపీ నేత కావడం అప్పట్లోనే కాస్త సంచలానికి దారి తీసింది, కాని తర్వాత ఆ చిత్ర నిర్మాతగా అతను వ్యవహరించడంలేదు అని వర్మ ప్రకటించినా ఇప్పుడు ఇలా ఎవరో వైసేపీ నేతల కోసం శ్రీ రెడ్డి తో పవన్ ని తిట్టించడం చూస్తే ఇదంతా వైసేపీ భారీ కుట్ర అని అర్ధం అవుతోంది. కాని ఆ కుట్ర పన్నిన వారు ఎవరు అనేది వెల్లడి కావాల్సి ఉంది.